[ad_1]
Multibagger Stocks: ఇండియన్ కార్పొరేట్ డిసెంబర్ త్రైమాసిక (Q3) ఆదాయాలు సంవత్సరానికి (YoY) ప్రాతిపదికన గొప్పగా లేవు, అలాగని చప్పగానూ లేవు. కొన్ని కంపెనీలు మాత్రం గణనీయంగా మెరుగుపడ్డాయి. రూ. 500 కోట్ల కంటే ఎక్కువ మార్కెట్ విలువ ఉన్న 69 కంపెనీలు, డిసెంబర్ త్రైమాసికంలో అటు ఆదాయాన్నీ, ఇటు లాభాన్నీ రెట్టింపు చేసి చూపాయి.
వీటిలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఇండియన్ హోటల్స్, GMR ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, EIH, మహానగర్ గ్యాస్, మాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, MTAR టెక్నాలజీస్, డ్రీమ్‌ఫోక్స్ సర్వీసెస్, ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్, ఉగ్రో క్యాపిటల్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి ప్రముఖ పేర్లు ఈ లిస్ట్‌లో కనిపిస్తాయి.
భారతదేశంలో అతి పెద్ద క్యారియర్ అయిన ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో) నికర లాభం సంవత్సరానికి 10 రెట్లు పెరిగి రూ. 1,423 కోట్లకు చేరింది. ఆదాయం కూడా రెట్టింపు కంటే ఎక్కువే పెరిగి రూ. 14,933 కోట్లకు చేరుకుంది.
ఇండియన్ హోటల్స్ ఆదాయం 2 రెట్లు పెరిగి రూ. 1,686 కోట్లకు చేరుకుంది, నికర లాభం 4 రెట్లు పెరిగి రూ. 379 కోట్లకు చేరుకుంది.
మారథాన్ నెక్స్ట్‌జెన్ రియాల్టీ లాభం ఏడాది క్రితం (2021 డిసెంబర్ త్రైమాసికం) నాటి కేవలం రూ. 2 కోట్ల నుంచి, 2022 డిసెంబర్ త్రైమాసికంలో రూ. 75 కోట్లకు పెరిగింది. ఆదాయం 7 రెట్లు పెరిగి రూ. 278 కోట్లకు చేరుకుంది.
కరోనా వైరస్ సెకండ్ వేవ్ తర్వాత ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో పునఃప్రారంభం కావడం, కరోనా ఆంక్షలు తొలగిపోవడం, వినియోగ వ్యయాల్లో గణనీయమైన పెరుగుదల వంటివి డిసెంబర్ త్రైమాసికంలో ఈ కంపెనీల తారస్థాయి పనితీరుకు బాసటగా నిలిచాయి.
టాప్‌లైన్ (ఆదాయం) & బాటమ్‌లైన్‌లో (లాభం) అనేక రెట్ల వృద్ధిని సాధించిన 69 కంపెనీల్లో, 13 షేర్లు గత సంవత్సర కాలంలో మల్టీబ్యాగర్ రిటర్న్స్ కూడా ఇచ్చాయి. ఇటు వ్యాపారంలో, అటు ఈక్విటీ మార్కెట్‌లో అవి రారాజుల్లా నిలిచాయి. ఆ స్క్రిప్‌లు, అవి అందించిన రాబడి శాతం ఇవి:
మల్టీబ్యాగర్ స్టాక్స్:
కంపెనీ పేరు ఏడాది కాలంలో రాబడి
మఫిన్ గ్రీన్ (Mufin Green Finance) 330.76%
అపార్ ఇండస్ట్రీస్ (Apar Industries) 286.64%
ప్రవేగ్ (Praveg) 262.45%
క్రెసండా సొల్యూషన్స్ (Cressanda Solutions) 251.46%
మోల్డ్-టెక్ టెక్నాలజీస్ (Mold-Tek Technologies) 204.72%
మారథాన్ నెక్స్ట్‌జెన్ రియాల్టీ(Marathon Nextgen Realty)154.74%
జూపిటర్ వ్యాగన్స్ (Jupiter Wagons) 150.95%
టిటాగర్ వ్యాగన్స్ (Titagarh Wagons) 118.71%
స్టెర్లింగ్ టూల్స్ (Sterling Tools) 115.11%
రిఫెక్స్ ఇండస్ట్రీస్ (Refex Industries) 114.47%
పెర్మెనెంట్ మాగ్నెట్స్ (Permanent Magnets) 107.85%
డాటా ప్యాట్రన్స్ (Data Patterns) 107.47%
KPI గ్రీన్ ఎనర్జీ (KPI Green Energy) 102.88%
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link
Leave a Reply