ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి – ఫోకస్‌లో YES Bank, Adani Stocks

[ad_1]

Stocks to watch today, 13 March 2023: ఇవాళ (సోమవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 54 పాయింట్లు లేదా 0.31 శాతం రెడ్‌ కలర్‌లో 17,383 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:

యెస్ బ్యాంక్: యెస్‌ బ్యాంక్‌లో షేర్లు కొన్న వ్యక్తిగత పెట్టుబడిదార్లు, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌కు RBI నిర్దేశించిన మూడేళ్ల లాక్-ఇన్ పీరియడ్ సోమవారంతో ముగుస్తోంది, దీంతో యెస్ బ్యాంక్ షేర్లు ఫోకస్‌లోకి వచ్చాయి. దాదాపు 49% వాటా ఉన్న SBI నేతృత్వంలోని తొమ్మిది బ్యాంకులు ఆ షేర్లను అమ్మేయవచ్చని భావిస్తున్నారు.

సోనా BLW ప్రెసిషన్ ఫోర్జింగ్స్: నివేదికల ప్రకారం, ఈ కంపెనీలో తన మొత్తం వాటాను బ్లాక్ డీల్ ద్వారా బ్లాక్‌స్టోన్ విక్రయించనుంది.

అదానీ గ్రూప్ స్టాక్స్: మార్జిన్-లింక్డ్ షేర్ తనఖా రుణాల్లో $2.15 బిలియన్లను ముందుస్తుగా, పూర్తిగా చెల్లించినట్లు అదానీ గ్రూప్ తెలిపింది. మార్చి 31 నాటి కమిట్‌లైన్ టైమ్‌లైన్‌కు చాలా ముందే ఈ పని పూర్తి చేసింది.

ఫినోలెక్స్ ఇండస్ట్రీస్: మార్చి 12 నుంచి, పుణెలోని తయారీ ఫ్లాంటులో PVC ఫిట్టింగ్స్‌ వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫ్లాంటు వార్షిక సామర్థ్యం 12,000 MT, దీని కాపెక్స్ సుమారు రూ. 100 కోట్లు.

నజారా టెక్నాలజీస్: తన స్టెప్‌ డౌన్‌ అనుబంధ సంస్థలైన Kiddopia Inc, Mediawrkz Inకు  సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌లో (SVB) రూ. 64 కోట్ల విలువైన నగదు నిల్వలు ఉన్నట్లు నజారా టెక్నాలజీస్ వెల్లడించింది.

సూల వైన్‌యార్డ్స్‌: సూల వైన్‌యార్డ్స్‌ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బిట్టు వర్గీస్, తన కెరీర్‌లో మరిన్ని అవకాశాలను అన్వేషించడానికి ఈ కంపెనీలో పదవికి రాజీనామా చేశారు.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్: మార్చి 14 నుంచి అమల్లోకి వచ్చేలా, తాత్కాలిక చైర్మన్‌గా సిద్ధార్థ మొహంతిని నియమించినట్లు LIC తెలిపింది. ప్రస్తుత చైర్‌పర్సన్‌ మంగళం రామసుబ్రమణియన్ కుమార్ పదవీకాలం నేటితో ముగియనుంది.

టెక్ మహీంద్ర: టెక్ మహీంద్ర MD & CEO గా మోహిత్ జోషి పేరును కంపెనీ బోర్డ్‌ ప్రకటించింది. ప్రస్తుత MD & CEO అయిన CP గుర్నానీ 19 డిసెంబర్ 2023న పదవీ విరమణ చేస్తారు, ఆ తర్వాతి నుంచి మోహిత్ ఆ చైర్‌లో కూర్చుంటారు.

ఇండస్ఇండ్ బ్యాంక్: ఇండస్‌ఇండ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ & CEO సుమంత్ కథ్‌పాలియాను మరో 2 సంవత్సరాల పాటు కొనసాగించడానికి RBI ఆమోదించింది.

ICICI లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్: ICICI లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్‌లో ఉన్న తన వాటాను మళ్లించడానికి సెప్టెంబర్ 9, 2024 వరకు సమయాన్ని పొడిగించాలన్న ICICI బ్యాంక్ అభ్యర్థనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదించింది.

పేటీఎం: మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్ నుంచి పూర్తిగా సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ నిష్క్రమించిందని, ప్రస్తుతం తమ కంపెనీలో ఎటువంటి పెట్టుబడులు లేవని పేటీఎం స్పష్టం చేసింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *