ఇవి తింటే ఇమ్యూనిటీ తగ్గి.. రోగాలు రౌండప్‌ చేస్తాయ్‌..!

[ad_1]

చక్కెర ఎక్కువగా తిన్నా..

చక్కెర ఎక్కువగా తిన్నా..

చక్కెర ఎక్కువగా తింటే.. రోగనిరోధక శక్తి బలహీనపడుతుందని నిపుణులు చెబుతున్నారు. చక్కెర శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను కలిగిస్తుంది. ఇది అనేక వ్యాధులకు ప్రధాన కారణం. చక్కెర రోగనిరోధక వ్యవస్థ కణాలను అణచివేస్తుంది. చక్కెర ఎక్కువగా తింటే.. ఇమ్యూనిటీ తగ్గడమే కాదు.. అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. NCBI నివేదిక ప్రకారం, స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల అధిక బరువు, గుండె సమస్యలు, డయాబెటిస్, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ మానిఫోల్డ్ ప్రమాదాన్ని పెంచుతుంది.​

Monsoon health care: వర్షాకాలం అలర్జీలకు చెక్‌ పెట్టే ఆహారాలు ఇవే..!

ప్రాసెస్డ్ మీట్..

ప్రాసెస్డ్ మీట్..

ప్రాసెస్‌ చేసిన మీట్‌ను క్యూరింగ్, సాల్టింగ్, స్మోకింగ్, డ్రైయింగ్, క్యానింగ్‌ పద్ధతి ద్వారా భద్రపరుస్తారు. ప్రాసెస్ చేసిన మాంసంలో సంతృప్త కొవ్వు, సోడియం, రసాయనాలు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తాయి. సాసేజ్‌లు, హాట్ డాగ్‌లు, సలామీ వంటి ప్రాసెస్‌ చేసిన మాంసాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. (image source – pixabay)

రిఫైన్డ్‌ కార్బ్స్‌..

రిఫైన్డ్‌ కార్బ్స్‌..

శుద్ధి చేసిన పిండి పదార్థాలు మీ బ్లడ్ షుగర్ లెవల్స్‌ను పెంచుతాయి. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్‌కు దారితీస్తుంది, మీ రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. వైట్ బ్రెడ్, మైదా, బంగాళాదుంప చిప్స్ వంటి రిఫైన్డ్‌ కార్బ్స్ ఆహారానికి దూరంగా ఉండాలి.

(image source – pixabay)​

కడుపులో ఈ సమస్యలు ఉంటే.. స్ట్రోక్‌ ముప్పు పెరుగుతుంది..!

కెఫిన్‌..

కెఫిన్‌..

కెఫిన్‌ డ్రింక్స్‌, ఫుడ్స్‌ ఎక్కువగా తీసుకుంటే.. శరీరం ఐరన్, కాల్షియం వంటి ఖనిజాలను గ్రహించే సామర్థ్యం తగ్గుతుంది. రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాలంటే.. ఈ మినరల్స్‌ చాలా ముఖ్యం. కెఫిన్‌ ఎక్కువగా తీసుకుంటే.. నిద్రకు భంగం కలుగుతుంది. ఇది కాలక్రమేణా రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది.

(image source – pixabay)

ఆల్కహాల్‌..

ఆల్కహాల్‌..

ఆల్కహాల్‌ ఎక్కువగా తాగితే.. రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. తద్వారా మీకు ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పు ఎక్కువ అవుతుంది. ఆల్కహాల్‌ ఊపిరితిత్తులను రక్షించే రోగనిరోధక కణాలను ప్రభావితం చేస్తుంది, ఊపిరితిత్తుల నుంచి శ్లేష్మం తొలగించే సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షించే.. తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేసే శరీర సామర్థ్యానికి కూడా ఆటంకం కలిగిస్తుంది.

(image source – pixabay)

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *