ఈ ఏడాది ఐపీవో సినిమా బ్లాక్‌బస్టర్‌, ఇన్వెస్టర్ల కళ్లలో ఆనందం చూసిన కంపెనీలు

[ad_1]

Indian IPO Market: ఇండియన్‌ ఐపీవో మార్కెట్‌కు 2023 బాగా కలిసొచ్చింది. ఈక్విటీ మార్కెట్‌ ర్యాలీతో పాటు బ్లాక్‌ బస్టర్‌ డెబ్యూలు కూడా కలిసి నడిచాయి. చాలా IPOలు రెండంకెల లాభాలు అందించాయి. లిస్టింగ్ తేదీ నుంచి ఇప్పటి వరకు డబుల్‌ రిటర్న్స్‌ డెలివెరీ చేశాయి. 

సెకండరీ మార్కెట్‌లో కొనసాగుతున్న ఆకర్షణీయమైన ర్యాలీ, ప్రైమరీ మార్కెట్‌ (IPO మార్కెట్) సెంటిమెంట్‌ను పెంచింది. ప్రపంచ దేశాల్లో అనిశ్చితులు, అస్థిరతలు ఉన్నా… ఇండియన్‌ స్టాక్ మార్కెట్ సూచీలు BSE సెన్సెక్స్ & NSE నిఫ్టీ50 ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD) 8.76% & 8.55% జంప్ చేశాయి.

2023లో ఇప్పటి వరకు 14 మేజర్‌ IPOలు ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ అయ్యాయి. వీటిలో ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లీడ్ గెయినర్‌గా ఉంది. ఈ స్టాక్ జులై 21 (లిస్టింగ్ డే) నుంచి 106% పెరిగింది. ఐపీవో ఇష్యూ ప్రైస్‌ రూ. 25 అయితే, షేర్లు 60% ప్రీమియంతో లిస్ట్‌ అయ్యాయి.

సైయెంట్‌ DLM కూడా లిస్టింగ్‌ డే నుంచి 95% లాభాలను తీసుకొచ్చి పెట్టుబడిదార్లను కళ్లలో సంతోషం చూసింది. ఐడియాఫోర్జ్ ఐపీవో ఇష్యూ ధర రూ. 672 అయితే, అంతకుమించి 93.45% పెరిగి, రూ. 1,300 వద్ద లిస్ట్ అయింది, దమ్ము చూపించింది. లిస్టింగ్‌ డే అయిన జులై 7 నుంచి ఈ స్టాక్ 70% ర్యాలీ చేసింది.

2023లో ఇప్పటి వరకు IPOల పెర్ఫార్మెన్స్‌: 

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్   | ఇష్యూ ప్రైస్‌: రూ. 25  | ఇష్యూ ప్రైస్‌ నుంచి పెరుగుదల: 106%

సైయంట్ DLM లిమిటెడ్.     | ఇష్యూ ప్రైస్‌: రూ. 265    | ఇష్యూ ప్రైస్‌ నుంచి పెరుగుదల: 95%

ఐడియాఫోర్జ్ టెక్నాలజీ లిమిటెడ్. | ఇష్యూ ప్రైస్‌: రూ. 672    | ఇష్యూ ప్రైస్‌ నుంచి పెరుగుదల: 70%

మ్యాన్‌కైండ్ ఫార్మా లిమిటెడ్ | ఇష్యూ ప్రైస్‌: రూ. 1,080    | ఇష్యూ ప్రైస్‌ నుంచి పెరుగుదల: 61%

సాహ్ పాలిమర్స్ లిమిటెడ్ | ఇష్యూ ప్రైస్‌: రూ. 65    | ఇష్యూ ప్రైస్‌ నుంచి పెరుగుదల: 52%

డివ్‌జీ టార్క్‌ట్రాన్స్‌ఫర్స్‌ సిస్టమ్స్ లిమిటెడ్. | ఇష్యూ ప్రైస్‌: రూ.  590   | ఇష్యూ ప్రైస్‌ నుంచి పెరుగుదల: 51%

ఐకియో లైటింగ్ లిమిటెడ్ | ఇష్యూ ప్రైస్‌: రూ. 285    | ఇష్యూ ప్రైస్‌ నుంచి పెరుగుదల: 47%

అవలాన్ టెక్నాలజీస్ లిమిటెడ్   | ఇష్యూ ప్రైస్‌: రూ. 436    | ఇష్యూ ప్రైస్‌ నుంచి పెరుగుదల: 37%

గ్లోబల్ సర్ఫేసెస్ లిమిటెడ్. | ఇష్యూ ప్రైస్‌: రూ. 140    | ఇష్యూ ప్రైస్‌ నుంచి పెరుగుదల: 32%

సెన్‌కో గోల్డ్ లిమిటెడ్ | ఇష్యూ ప్రైస్‌: రూ. 317    | ఇష్యూ ప్రైస్‌ నుంచి పెరుగుదల: 31%

నెక్సస్‌ సెలక్ట్‌ ట్రస్ట్‌  | ఇష్యూ ప్రైస్‌: రూ. 100    | ఇష్యూ ప్రైస్‌ నుంచి పెరుగుదల: 16%

రేడియంట్ క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ | ఇష్యూ ప్రైస్‌: రూ. 94    | ఇష్యూ ప్రైస్‌ నుంచి పెరుగుదల: 6%

HMA ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ | ఇష్యూ ప్రైస్‌: రూ. 585    | ఇష్యూ ప్రైస్‌ నుంచి పెరుగుదల: 3%

ఉదయశివకుమార్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ | ఇష్యూ ప్రైస్‌: రూ. 35    | ఇష్యూ ప్రైస్‌ నుంచి పెరుగుదల: −15%

మరో ఆసక్తికర కథనం: రిఫండ్‌ ఇంకా రాలేదా?, ఎక్కువ మంది చేసే పొరపాటును మీరూ చేశారేమో చెక్‌ చేసుకోండి

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *