[ad_1]
యాపిల్..
యాపిల్స్‌లో కరిగే ఫైబర్, నీరు అధికంగా ఉంటాయి. ఇది పేగుల గోడను హైడ్రేట్ చేయడానికి, వ్యర్థాలను బయటకు పంపడానికి దోహదపడతాయి. ఇవి జీర్ణశయాంతర కార్యకలాపాల రేటును కూడా పెంచుతాయి. పేగుల గుండా మలం మరింత సులభంగా వెళ్తుంది.
(image source – pixabay)
పెద్ద పేగులో పుండ్లు ఎందుకు వస్తాయి
అరటిపండు..
అరటిపండులో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. అంతే కాకుండా పొటాషియం, విటమిన్లు, ఫోలేట్ వంటి పోషకాలు ఇందులో లభిస్తాయి. పేగుల్లో పేరుకుపోయిన మురికిని తొలగించేందుకు ఈ పండు చక్కటి మార్గం. విరేచనాలు, మలబద్ధకం వంటి కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పండిన అరటిపండ్లను తినండి. (image source – pixabay)
Health Care: ఈ 6 అలవాట్లు ఉంటే.. మిమ్మల్ని రోగాలు రౌండప్ చేస్తాయ్..!
పియర్స్..
పియర్స్‌లో ప్రీబయోటిక్ ఫైబర్ ఉంటుంది. పియర్స్ ప్రోబయోటిక్ బ్యాక్టీరియాను మెరుగుపరచి.. పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. పియర్స్‌లో పైబర్ మెండుగా ఉంటుంది. ఇది పేగుల నుంచి హానికరమైన టాక్సిన్లను తొలగిస్తుంది. ఇది మలాన్ని మృదువుగా ఉంచుతుంది, పేగుల కదలకిను మెరుగుపరుస్తుంది. పియర్స్ తరచుగా తీసుకుంటే.. పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అవకాడో..
అవకాడోలో యాంటీ ఆక్సిడెంట్లు, గ్లుటాతియోన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పేగు గోడల కణాలను రిపేర్ చేస్తాయి. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.. ఇది పేగులలో వ్యర్థాలను, టాక్సిన్స్ తొలగిస్తాయి. జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం అవకాడో రోజూ తింటే జీర్ణాశయంలోని సూక్ష్మజీవుల వైవిధ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది.
(image source – pixabay)
స్ట్రాబెర్రీ..
స్ట్రాబెర్రీస్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ పండు జీర్ణాశయంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను నిర్మిస్తుంది. ఫైబర్ ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను నిర్వహించడానికి సహాయపడుతుంది. మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది, రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఈ పండు మలబద్ధకం, జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఇతర సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. (image source – pixabay)
Best Fruits For Diabetes: షుగర్ పేషెంట్స్ ఈ పండ్లు తింటే.. ఔషధంతో సమానం..!
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply