ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ IDFC Bk, Zomato, IIFL Sec, Olectra

[ad_1]

Stock Market Today, 08 December 2023: ఏడు రోజుల వరుస ర్యాలీ తర్వాత, నిన్న (గురువారం) స్టాక్‌ మార్కెట్‌లో ప్రాఫిట్‌ బుకింగ్‌ కనిపించింది. ఆర్‌బీఐ పాలసీ రేట్లు, యుఎస్ పేరోల్ డేటా ముందు మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. ఈ రోజు మార్కెట్లు ఆర్‌బిఐ పాలసీ మీటింగ్‌ నిర్ణయాలు, గవర్నర్‌ వ్యాఖ్యల ఆధారంగా ప్రతిస్పందిస్తాయి.

గురువారం సెషన్‌ ఉదాహరణగా తీసుకుంటే, ఈ రోజు సెషన్‌లో నిఫ్టీలో ఊగిసలాట ఉండొచ్చు. సైకలాజికల్‌ లెవల్‌గా ఉన్న 21000 స్థాయి ఇప్పుడు అతి పెద్ద హర్డిల్‌ కావచ్చు. 19521 దగ్గర బలమైన మద్దతు దొరుకుతుందని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.

క్షీణించిన ఆసియా స్టాక్స్‌
శుక్రవారం ప్రారంభంలో ఆసియా స్టాక్స్ పడిపోయాయి. బ్యాంక్ ఆఫ్ జపాన్ ప్రతికూల వడ్డీ రేటు విధానం ముగింపు దశకు చేరుకుంటుందని ట్రేడర్లు బెట్స్‌ వేస్తున్నారు. జపాన్ టాపిక్స్ 1.1%; ఆస్ట్రేలియా S&P/ASX 200 0.1% పడిపోతే; 
హాంగ్ సెంగ్ ఫ్యూచర్స్ 0.3% పెరిగింది.

లాభాల్లో US స్టాక్స్
అడ్వాన్స్‌డ్ మైక్రో డివైజెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఆల్ఫాబెట్ మంచి కబురు చెప్పడంతో యూఎస్‌లో మెగా క్యాప్స్‌ ర్యాలీ చేశాయి, నాస్‌డాక్ గురువారం బాగా పెరిగింది. అక్కడి కీలక మార్కెట్లు S&P 500 0.80%; నాస్‌డాక్ కాంపోజిట్ 1.37%; డౌ జోన్స్ 0.18% రాణించాయి.

ఉదయం 8.10 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 08 పాయింట్లు లేదా 0.04% రెడ్‌ కలర్‌లో 21,073 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు ఫ్లాట్‌గా అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 

వడ్డీ రేట్లకు ప్రతి స్పందించే స్టాక్స్: ఆర్‌బీఐ ఈ రోజు తన పాలసీ నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్, ఆటో, రియల్ ఎస్టేట్ షేర్లపై మార్కెట్‌ ఫోకస్‌ ఉంటుంది.

IDFC ఫస్ట్ బ్యాంక్: యుఎస్‌కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ వార్‌బర్గ్ పింకస్, గురువారం, బ్లాక్ డీల్స్ ద్వారా IDFC ఫస్ట్ బ్యాంక్‌లో కొంత వాటా విక్రయించింది.

జొమాటో: జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్, ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటోలో $135 మిలియన్ల విలువైన షేర్లను ఈ రోజు బ్లాక్ డీల్ ద్వారా విక్రయించే అవకాశం ఉంది.

ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్: మ్యాట్రిక్స్ పార్ట్‌నర్స్‌ ఫైవ్-స్టార్ బిజినెస్ ఫైనాన్స్‌లో 5.87% వాటాను బ్లాక్ డీల్స్ ద్వారా విక్రయించే అవకాశం ఉంది.

శ్రీరామ్ ఫైనాన్స్: లోన్‌ కో-లెండింగ్ స్కీమ్‌ కింద MSME రుణగ్రహీతలకు విడతల వారీగా రుణాలు జారీ చేయడానికి SIDBIతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని శ్రీరామ్ ఫైనాన్స్ అమలు చేస్తోంది.

ఓలెక్ట్రా గ్రీన్‌టెక్: 40 ఎలక్ట్రిక్ బస్సుల సరఫరా, నిర్వహణ కోసం ముంబైలోని వసాయ్ విరార్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి లెటర్‌ ఆఫ్‌ అవార్డ్‌ అందుకుంది.

కాంకర్: సౌర శక్తిని ప్రోత్సహించే లక్ష్యంతో, కాంకోర్ టెర్మినల్స్‌లో PV సౌర పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించడానికి కంటైనర్ కార్ప్, NTPC విద్యుత్ వ్యాపార్‌ నిగమ్ ఒక MoU కుదుర్చుకున్నాయి.

IIFL సెక్యూరిటీస్: కొత్త క్లయింట్స్‌ను యాడ్‌ చేసుకోకుండా IIFL సెక్యూరిటీస్‌పై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఇచ్చిన SEBI ఆర్డర్‌ను SAT రద్దు చేసింది.

సంఘీ ఇండస్ట్రీస్: హోల్ టైమ్ డైరెక్టర్ & CEOగా సుకూరు రామారావును నియమించింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: మీ పాత ఇంటిని అమ్ముతున్నారా?, ఎంత టాక్స్‌ కట్టాలో ముందు తెలుసుకోండి

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *