PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ TCS, Bharti Hexacom, PVR Inox, Vodafone

[ad_1]

Stock Market Today, 12 April 2024: గత సెషన్‌లోనూ కొత్త రికార్డ్‌ సృష్టించిన ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు, ఈ రోజు (శుక్రవారం) నెగెటివ్‌ నోట్‌తో ప్రారంభం కావచ్చు. గురువారం భారత మార్కెట్లు సెలవు తీసుకున్నా, గ్లోబల్‌ మార్కెట్లు పని చేశాయి. US ద్రవ్యోల్బణం డేటా తర్వాత ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆశలు సన్నగిల్లడంతో విదేశీ మార్కెట్లు క్షీణించాయి.

బుధవారం, నిఫ్టీ 22,753.80 దగ్గర క్లోజ్‌ అయింది. ఈ ఉదయం 8.00 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 22,660 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు గ్యాప్‌ డౌన్‌లో ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా-పసిఫిక్ మార్కెట్లలో  సెంటిమెంట్‌ మిశ్రమంగా ఉంది. సింగపూర్, దక్షిణ కొరియా, చైనా నుంచి వచ్చే ఆర్థిక & వాణిజ్య డేటా కోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. ఈ ఉదయం… జపాన్‌లోని నికాయ్‌ 0.29 శాతం, టోపిక్స్‌ 0.55 శాతం పెరిగాయి. దక్షిణ కొరియాలోని కోస్పి 0.33 శాతం పతనం కాగా, కోస్‌డాక్ 0.85 శాతం పెరిగింది. ఆస్ట్రేలియాలో, S&P/ASX 200 0.41 శాతం క్షీణించింది. హాంగ్‌కాంగ్‌లోని హ్యాంగ్‌సెంగ్ ఇండెక్స్ 1.68 శాతం విలువ కోల్పోయింది.

నిన్న, U.S.లో టెక్ స్టాక్స్‌ పుంజుకోవడంతో S&P 500, నాస్‌డాక్ కాంపోజిట్ వరుసగా 0.74 శాతం, 1.68 శాతం లాభాలతో ముగిశాయి. డౌ జోన్స్ రేంజ్‌ బౌండ్‌లో ఉంది.

అమెరికన్‌ బెంచ్‌మార్క్‌ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ స్వల్పంగా తగ్గి 4.56 శాతం వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ $90 పైన కొనసాగుతోంది. గోల్డ్ ఫ్యూచర్స్ రికార్డ్‌ స్థాయిలో ఔన్సుకు $2,412 దగ్గర ఉంది. 
 
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 

భారతి హెక్సాకామ్: ఈ కంపెనీ షేర్లు ఈ రోజు స్టాక్‌ మార్కెట్లలో లిస్ట్‌ అవుతాయి. గ్రే మార్కెట్ ప్రీమియం ప్రకారం, ఈ స్టాక్ 15 శాతం వరకు లిస్టింగ్ లాభాన్ని సూచిస్తోంది.

TCS: ఈ మార్కెట్‌ ముగిసిన తర్వాత ఈ IT మేజర్ Q4 ఫలితాలు వెల్లడవుతాయి, బలమైన త్రైమాసిక పనితీరును రిపోర్ట్‌ చేస్తుందని భావిస్తున్నారు. 

విప్రో: మలయ్ జోషిని ‘అమెరికాస్ 1’ స్ట్రాటజిక్ మార్కెట్ యూనిట్ (SMU) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించారు, ఇది తక్షణమే అమలులోకి వస్తుంది. 

వొడాఫోన్‌ ఐడియా: ఈ కంపెనీ రూ. 18,000 కోట్ల FPO ఈ నెల 18న ప్రారంభం అవుతుంది, 22న ముగుస్తుంది.

మహారాష్ట్ర సీమ్‌లెస్: సీమ్‌లెస్ పైపుల కేసింగ్ కోసం ONGC నుంచి 674 కోట్ల రూపాయల ఆర్డర్‌ పొందింది.

PVR ఐనాక్స్: బెంగళూరులోని ఫీనిక్స్ మాల్‌లో 14-స్క్రీన్ల మెగాప్లెక్స్‌ను ప్రారంభించినట్లు PVR ఐనాక్స్‌ ప్రకటించింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB): ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ మూడు టెన్యూర్లలో MCLR రేట్లను 5 బేసిస్ పాయింట్లు పెంచింది. బ్యాంక్‌ వెబ్‌సైట్‌ ప్రకారం… ఒక సంవత్సరం MCLR రేటు 8.85 శాతానికి, ఆరు నెలలు MCLR రేటు 8.65 శాతానికి, మూడు నెలల MCLR రేటు 8.45 శాతానికి పెరిగాయి.

FMCG: ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం ఉంటుందని, మంచి రుతుపవన వర్షాలు కురుస్తాయని స్కైమెట్ అంచనా వేయడంతో FMCG కంపెనీలు మార్కెట్‌ ఫోకస్‌లో ఉంటాయి. FY24తో పోలిస్తే FY25లో మెరుగైన అమ్మకాలను ఈ కంపెనీలు ఆశిస్తున్నాయి. గ్రామీణ డిమాండ్‌ ఇప్పటికే పుంజుకుంది.

వరుణ్ బెవరేజెస్: హౌబాన్‌ ఎనర్జీ 11, ఆస్పిరేషన్ క్రియేటివ్‌లో 14 శాతం వరకు ఈక్విటీ వాటాను ఈ కంపెనీ కొనుగోలు చేయబోతోంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు – ఈ రోజు రేట్లు ఇవి

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *