ఎస్‌బీఐ స్పెషల్‌ స్కీమ్‌ మళ్లీ వచ్చిందోచ్‌, ₹5 లక్షలకు ₹43,000 వడ్డీ మీ సొంతం

[ad_1]

SBI Amrit Kalash Scheme: దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తన స్పెషల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం గడువును మళ్లీ పొడిగించింది. వాస్తవానికి, ఆ స్కీమ్‌లో చేరే లక్కీ ఛాన్స్‌ ఈ నెల (ఆగస్టు) 15తోనే ముగిసింది. అయితే, ప్రత్యేక పథకాన్ని రీ-లాంచ్‌ చేసి, లాస్ట్‌ డేట్‌ను ఈ ఏడాది డిసెంబర్‌ 31వ తేదీ వరకు ఎస్‌బీఐ పొడిగించింది.    

స్టేట్‌ బ్యాంక్‌, గడువు పొడిగించిన ప్రత్యేక పథకం పేరు ‘అమృత్‌ కలశ్‌’ (SBI Amrit Kalash Scheme). షార్ట్‌ టర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌తో మంచి వడ్డీ ఆదాయం సంపాదించాలని ప్లాన్‌ చేస్తున్న వాళ్లకు ఇది అనువైన FD స్కీమ్‌.

అమృత్‌ కలశ్‌ స్కీమ్‌ ఇంట్రెస్ట్‌ రేట్‌       
SBI అమృత్‌ కలశ్‌ పథకం టైమ్‌ పరియడ్‌ 400 రోజులు. ఈ డిపాజిట్‌ పథకంలో పెట్టుబడి పెట్టే సీనియర్‌ సిటిజన్లకు ఏటా 7.6 శాతం వడ్డీ రేటు అందుతుంది. సాధారణ పౌరులకు ఏడాదికి 7.1 శాతం వడ్డీ రేటును బ్యాంక్‌ జమ చేస్తుంది. ఎస్‌బీఐ ఉద్యోగులు, పెన్షనర్లకు అదనంగా ఒక శాతం వడ్డీరేటు SBI ఆఫర్‌ చేస్తోంది.

వడ్డీ రేటుపై ఒక ఉదాహరణను పరిశీలిస్తే… ఎస్‌బీఐ అమృత్‌ కలశ్‌లో ఒక సీనియర్‌ సిటిజన్‌ ఒక 5 లక్ష రూపాయలు డిపాజిట్‌ చేస్తే, 7.6 శాతం వడ్డీ రేటు ప్రకారం 400 రోజులకు రూ. 43,000 వడ్డీ వస్తుంది. రూ. 5 లక్షల డిపాజిట్‌కు 7.6 శాతం వడ్డీ రేటు ప్రకారం, ఒక సాధారణ పౌరుడికి లభించే వడ్డీ మొత్తం 40,085 రూపాయలు.

అమృత్‌ కలశ్‌ కోసం ఎలా అప్లై చేసుకోవాలి?     
మీకు దగ్గరలో ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడి వరకు వెళ్లేంత సమయం మీకు లేకపోతే ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఎస్‌బీఐ యోనో (SBI YONO) యాప్‌ ద్వారా కూడా ఈ స్కీం కోసం అప్లై చేసుకోవచ్చు.

ఈ స్కీమ్‌ను మెచ్యూరిటీ తేదీ కంటే ముందుగానే రద్దు చేసుకునే సదుపాయం ఉంది. దీంతో పాటు, ఈ డిపాజిట్‌ను మీద బ్యాంక్‌ లోన్‌ కూడా వస్తుంది.

అమృత్‌ కలశ్‌ పథకంపై మీరు తీసుకునే వడ్డీపై ఇన్‌కం టాక్స్‌ రూల్స్‌ ప్రకారం TDS కట్‌ అవుతుంది. ఇలా కట్‌ అయిన మొత్తాన్ని, మీరు ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేసే సమయంలో క్లెయిమ్‌ చేసుకోవచ్చు. 

రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాల్లో ఉండే దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్లు, NRI రూపాయి టర్మ్ డిపాజిట్లు రెండింటికీ ఈ పథకం వర్తిస్తుంది. కొత్తగా డిపాజిట్‌ చేయడంతో పాటు, పాత డిపాజిట్‌ను కూడా రెన్యూవల్ చేసుకోవచ్చు. ఇందులో, టర్మ్ డిపాజిట్ & స్పెషల్‌ టర్మ్ డిపాజిట్ సౌకర్యం కూడా ఖాతాదార్లకు అందుబాటులో ఉంది.

మరో ఆసక్తికర కథనం: బంపర్ ఆఫర్‌ ఇచ్చిన గోల్డ్‌ – ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial   

 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *