PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఏడు వారాల ర్యాలీకి సడెన్‌ బ్రేక్‌ – ఏకంగా 5.90 బి. డాలర్లు తగ్గిన ఫారెక్స్‌ రిజర్వ్స్‌

[ad_1]

Foreign Exchange Reserves in India: భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో ఇటీవలి సుదీర్ఘ ర్యాలీకి బ్రేక్‌ పడింది. వరుసగా, గత ఏడు వారాల పాటు పెరిగిన విదేశీ కరెన్సీ నిల్వలు ఎనిమిదో వారంలో తగ్గాయి, 617.30 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. అంతకుముందు వారంలో 623.20 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన డేటా ప్రకారం, 2024 జనవరి 5వ తేదీతో ముగిసిన వారంలో భారతదేశంలో విదేశీ మారక నిల్వలు (India’s Forex Reserves) 5.90 బిలియన్‌ డాలర్లు తగ్గి 617.30 బిలియన్‌ డాలర్లకు దిగి వచ్చాయి. దీనికిముందు, 2023 డిసెంబర్ 29తో ముగిసిన వారంలో 2.75 బిలియన్ డాలర్లు పెరిగి 623.20 బిలియన్‌ డాలర్లకు చేరాయి. గత ఏడు వారాల్లో విదేశీ మారకద్రవ్య నిల్వలు 30.12 బిలియన్ డాలర్లు పెరిగాయి. 

భారతదేశ విదేశీ మారక నిల్వలు 2021 అక్టోబర్‌ నెలలో అత్యధిక స్థాయికి, 645 బిలియన్ డాలర్లకు ‍‌(Forex reserves all-time high record) చేరుకున్నాయి. ఇది, జీవిత కాల గరిష్ట రికార్డ్‌. ఆ రికార్డ్‌ను బద్ధలు కొట్టడానికి ఇప్పుడు 28 బిలియన్‌ డాలర్ల దూరంలో ఉన్నాయి. 

2024 జనవరి 5తో ముగిసిన వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు (Foreign Currency Assets – FCA) 4.96 బిలియన్ డాలర్ల క్షీణతతో 546.65 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఫారిన్‌ కరెన్సీ అసెట్స్‌ అంటే.. విదేశీ మారక నిల్వల్లో ఉన్న యూరో, పౌండ్, యెన్ వంటి అమెరికాయేతర కరెన్సీ యూనిట్ల విలువలో పెరుగుదల లేదా తరుగుదల విలువ. అమెరికన్‌ డాలర్ల రూపంలో ఈ విలువను చెబుతారు. 

తగ్గిన బంగారం నిల్వలు           
సమీక్ష కాలంలో ఆర్‌బీఐ వద్ద బంగారం నిల్వలు కూడా తగ్గుముఖం పట్టాయి. బంగారం నిల్వలు  (Gold reserves In India) 839 మిలియన్ డాలర్లు తగ్గి 47.48 బిలియన్ డాలర్లకు దిగి వచ్చాయి. SDRs (Special Drawing Rights) 67 మిలియన్‌ డాలర్లు తగ్గి 18.29 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధిలో (IMF) డిపాజిట్ చేసిన నిల్వలు కూడా క్షీణించాయి, 26 మిలియన్ డాలర్లు తగ్గి 4.86 బిలియన్ డాలర్లకు చేరాయి. 

దేశంలో తగినన్ని విదేశీ కరెన్సీ నిల్వలు ఉన్నాయని భారత ప్రభుత్వం నిరంతరం చెబుతోంది. ఏ దేశంలోనైనా విదేశీ మారక నిల్వలు ఎంత ఎక్కువ స్థాయిలో ఉంటే ఆ దేశం ఆర్థికంగా అంత బలంగా ఉంటుంది. దేశ ఆర్థిక స్థిరత్వంలో ఫారెక్స్‌ రిజర్వ్స్‌ది కీలక పాత్ర. విదేశీ మారక నిల్వలు తగ్గుతున్నాయంటే, ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ఒత్తిడిగా దానిని గుర్తించాలి. 

విదేశీ కరెన్సీ నిల్వల్లో మార్పులకు ప్రధాన కారణాల్లో ఒకటి కరెన్సీ మార్కెట్‌లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ జోక్యం. విదేశీ కరెన్సీ ఆస్తుల పెరుగుదల లేదా తగ్గుదల ప్రభావం RBI విదేశీ మారక నిల్వల డేటాను కూడా ప్రభావితం చేస్తుంది. 

బలపడిన రూపాయి (Indian Rupee Value)
శుక్రవారం (జనవరి 12, 2024) రోజున, కరెన్సీ మార్కెట్‌లో ఒక డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.92 వద్ద (dollar to rupee exchange rate) ముగిసింది, 12 పైసలు బలపడింది.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *