గుమ్మడి గింజలు రోజూ తింటే.. ఈ అనారోగ్యాలకు చెక్‌ పెట్టవచ్చు..!

[ad_1]

Pumpkin Seeds Health Benefits: గుమ్మడికాయను సాంబర్‌లో వేసుకుని, దప్పలం చేసుకుని ఎంజాయ్‌ చేస్తూ ఉంటాం. గుమ్మడికాయ పోషకాల పవర్‌ హౌస్‌ అని చాలా మందికి తెలుసు. దీనిలో బీటాకెరొటీన్, విటమిన్‌ సి, విటమిన్‌ ఇ, ఐరన్‌, ఫోలేట్‌ , పొటాషియం, ట్రిప్టోఫాన్ అమైనో యాసిడ్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుమ్మడికాయ గింజలు.. గుమ్మడికాయలోని పోషకాలకు ఏమాత్రం తీసిపోవని నిపుణులు అంటున్నారు. గుమ్మడి గింజల్లో ఫైబర్, విటమిన్‌ ఏ, బీ, సీ ఈ తో పాటు ఐరన్‌, కాల్షియం, జింక్‌, ఫోలేట్‌ , ఫ్యాటీ యాసిడ్స్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం, జింక్, అమైనో యాసిడ్స్‌ ఫినోలిక్‌ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి గింజలలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, యాంటీ ఆర్థరైటిక్‌తోపాటు యాంటీ డయాబెటిక్ లక్షణాలున్నాయి. మన రోజూవారీ గుమ్మడి గింజలను చేర్చుకుంటే.. ఆరోగ్యానికి మంచిదని క్లినికల్ న్యూట్రిషనిస్ట్ లిమా మహాజన్ అన్నారు. గుమ్మడికాయ గింజలను రోస్ట్‌ చేసి.. సలాడ్‌, సూప్‌లపై చల్లకుని తీసుకోవచ్చని అన్నారు. గుమ్మడి గింజలు తీసుకుంటే.. ఎలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో మనకు వివరించారు.

గుమ్మడి గింజలు

థైరాయిడ్‌ పేషెంట్స్‌కు మంచిది..

గుమ్మడి గింజలలో జింక్, సెలీనియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ పనితీరుకు సహాయపడతాయి. థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నవారు.. ప్రతిరోజూ గుమ్మడి విత్తనాలు తీసుకుంటే మంచిదని న్యూట్రిషనిస్ట్ లిమా మహాజన్ సూచించారు. గుమ్మడి గింజలు.. థైరాయిడ్‌ను కంట్రోల్‌ ఉంచుతాయి. థైరాయిడ్‌ లక్షణాలను తగ్గిస్తాయని వెల్లడించారు.

ఇన్‌ఫెర్టిలిటీకి పరిష్కారం..

ఈ రోజుల్లో చాలా మంది దంపతులు.. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. పురుషులు స్మెర్మ్‌ కౌంట్‌, క్వాలీటీ సమస్యలతో, మహిళలు.. హార్మోన్‌ అసమతుల్యతల కారణంగా.. ఇన్‌ఫెర్టిలిటీని ఎదుర్కొంటున్నారు. జింక్ లోపం కారణంగా.. పురుషుల సంతానోత్పత్తి ప్రభావితమవుతుంది. గుమ్మడి గింజల్లో ఫైటోస్టెరాల్స్, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పురుషుల సంతానోత్పత్తిని సామర్థ్యాన్ని, మహిళలలో హార్మోన్ల సమస్యలను దూరం చేస్తాయి. జింక్‌ స్పెర్మ్‌ చురుకుగా, ఆరోగ్యంగా ఉండటానికి ఎంతగానో తోడ్పడుతుంది.

మెనోపాజ్..

ఎన్నో ఏళ్లపాటు పాటు క్రమం తప్పకుండా వచ్చిన నెలసరి ఆగిపోయే టైమ్ మెనోపాజ్. మెనోపాజ్‌… పునరుత్పత్తి జీవితానికి ముగింపు. ఇది సాధారణంగా మహిళలు 40 లేదా 50 ఏళ్లలో ఉన్నప్పుడు జరుగుతుంది.. ఈ సమయంలో హార్మోన్లలో వచ్చే తేడాల కారణంగా భావోద్వేగాల్లో మార్పులు, శారీరక ఇబ్బందులూ వస్తాయి. ఈ సమయంలో, వేడి ఆవిర్లు, కీళ్ల నొప్పులు, మైగ్రేన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. మెనోపాజ్‌ సమయంలో మహిళలు గుమ్మడి గింజలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ గింజల్లో ఉండే.. ఫైటోఈస్ట్రోజెన్ మెనోపాజ్ లక్షణాల నుంచి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది. నెలసరి నిలిచిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ ముప్పు తగ్గటానికీ గుమ్మడి గింజలు తోడ్పడుతున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

యాంటిడిప్రెసెంట్స్..

ఆఫీస్‌ పనులు, ఆర్థిక విషయాలు, వ్యక్తిగత కారణాల వల్ల చాలా మందికి ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉంటుంది. మీ ఒత్తిడి తగ్గించుకుని.. స్ట్రెస్‌ ఫ్రీ లైఫ్‌ జీవించాలంటే గుమ్మడి గింజలు బెస్ట్‌ ఆప్షన్‌. ఈ గింజలో ట్రిప్టోఫాన్ అనే మూలకం ఉంటుందని, ఇది డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.

గుండెకు మేలు..

గుమ్మడి గింజల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. మెగ్నీషియం హైపర్‌టెన్షన్‌ కంట్లోల్‌లో ఉంచుతాయి. గుమ్మడి గింజలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. గుమ్మడి గింజలు రక్తం పీహెచ్‌ను క్రమబద్ధం చేస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి.

చర్మానికి మంచిది..

గుమ్మడి గింజల్లో జింక్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది కణాల పునరుద్ధరణ, కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడతాయి. దీనిలో చర్మానికి మేలు చేసే ప్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. గుమ్మడి గింజలు తీసుకుంటే.. స్పాట్‌లెస్‌, క్రియర్‌ స్కిన్‌ పొందవచ్చు.

ప్రోస్టేట్‌కు మంచిది..

ప్రోస్టేట్ పనితీరు జింక్ స్థాయిపై ఆధారపడి ఉంటుంది. జింక్ అధికంగా ఉండే గుమ్మడి గింజలు మన డైట్‌లో చేర్చుకుంటే.. ప్రోస్టేట్‌ ఆరోగ్యంగా ఉంటుంది.

షుగర్‌ పేషెంట్స్‌కు మంచిది..

గుమ్మడి గింజల్లో యాంటీడయాబెటిక్‌ లక్షణాలు ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్‌లో ఉంచుతాయి. గుమ్మడి గింజల్లో ట్రైగోనిలైన్, నికోటినిక్ యాసిడ్, డి-కైరో-ఐనాసిటాల్ అనే సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్‌లో ఉంచుతాయి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *