గ్రీన్‌చెఫ్‌ IPO ప్రైస్‌ బ్యాండ్‌ ఫిక్స్‌, బిడ్‌ వేద్దామనుకుంటున్నారా?

[ad_1]

Greenchef Appliances IPO: వంటగది వస్తువులను అమ్మే ఫేమస్‌ కంపెనీ గ్రీన్‌చెఫ్‌ అప్లయెన్సెస్, తన పబ్లిక్‌ ఇష్యూ ప్రైస్‌ బ్యాండ్‌ను నిర్ణయించింది. IPOలో ఒక్కో షేరును రూ. 82-87 మధ్య ఇష్యూ చేస్తుంది. 

గ్రీన్‌చెఫ్‌ అప్లయెన్సెస్ ఐపీవో వివరాలు
గ్రీన్‌చెఫ్‌ అప్లయెన్సెస్ ఐపీవో శుక్రవారం (23 జూన్‌ 2023) ఓపెన్‌ అవుతుంది, మంగళవారం (27 జూన్ 2023‌) ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ గురువారం ప్రారంభమవుతుంది.

ఈ కంపెనీ షేర్లు వచ్చే నెల 6న (06 జులై 2023) స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అవుతాయి. స్మాల్‌ & మీడియం కంపెనీల ఫ్లాట్‌ఫామ్‌ అయిన ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్‌లో (NSE Emerge) నమోదవుతాయి.

ఇనీషియల్‌ షేర్‌ సేల్‌లో, 61.63 లక్షలకు పైగా ఫ్రెష్‌ షేర్లను కంపెనీ జారీ చేస్తుంది. ప్రైస్ బ్యాండ్ అప్పర్‌ ఎండ్‌ (రూ.87) ప్రకారం, IPO ద్వారా ఈ కంపెనీ రూ. 53.62 కోట్లను సమీకరించాలని చూస్తోంది.

IPO నుంచి వచ్చే ఆదాయాన్ని మూలధన వ్యయం కోసం (Capital Expenditure) ఉపయోగించుకోవాలన్నది కంపెనీ ప్లాన్‌. ఆ డబ్బుతో అదనపు ప్లాంట్, మెషినరీ ఏర్పాటు, ఫ్యాక్టరీ భవనాల నిర్మాణం చేపడతామని IPO పేపర్స్‌లో వెల్లడించింది. వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం కూడా ఐపీవో ఆదాయాన్ని వినియోగించుకుంటుంది.

గ్రీన్‌చెఫ్ అప్లయెన్సెస్ అనేది కిచెన్ సొల్యూషన్స్ ప్రొవైడర్. 20 కేటగిరీల్లో కిచెన్‌కు సంబంధించిన వస్తువులను ఉత్పత్తి చేసి మార్కెట్‌లో అమ్ముతోంది.

ఈ కంపెనీకి ఐదు ఉత్పత్తి యూనిట్లు ఉన్నాయి. వాటిలో నాలుగు కర్ణాటకలో, ఒకటి హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది.

2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో (2022 ఏప్రిల్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు) ఈ కంపెనీ రూ. 254.82 కోట్ల ఆదాయం ఆర్జించింది. దానిపై రూ. 10.21 కోట్ల నికర లాభాన్ని మిగుల్చుకుంది.

HMA ఆగ్రో ఇండస్ట్రీస్ ఐపీవో
HMA ఆగ్రో ఇండస్ట్రీస్ ఐపీవో (HMA Agro Industries IPO) మంగళవారం ప్రారంభమైంది. పబ్లిక్‌ ఇష్యూ మొదటి రోజున 7% సబ్‌స్క్రైబ్ అయింది. IPO ద్వారా ఈ కంపెనీ రూ. 150 కోట్లను సమీకరించబోతోంది. ఒక్కో షేరుకు రూ. 555-585 ధరను ప్రైస్‌ బ్యాండ్‌గా ‍‌(IPO Price Band) నిర్ణయించింది. ప్రస్తుతం గ్రే మార్కెట్‌లో ఒక్కో షేరు రూ. 25 ప్రీమియంతో (అధిక ధర) ట్రేడ్‌ అవుతోంది. దేశంలో, గేదె మాంసాన్ని ఎగుమతి చేసే మొదటి మూడు సంస్థల్లో ఈ కంపెనీ ఒకటి. “బ్లాక్ గోల్డ్”, “కామిల్” & “HMA” బ్రాండ్‌లతో మాంసాన్ని అమ్ముతుంది. ఈ కంపెనీ ఎగుమతులు 40కి పైగా దేశాలకు వెళ్తాయి. వ్యవసాయ సహజ ఉత్పత్తులు, కూరగాయలు, తృణధాన్యాలను కూడా HMA ఆగ్రో ఇండస్ట్రీస్ ఎగుమతి చేస్తుంది.

మరో ఆసక్తికర కథనం: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ Shriram Finance, Airtel

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *