జస్ట్‌ 9 పాయింట్లే తక్కువ! 20,000 దాదాపుగా టచ్‌ చేసిన నిఫ్టీ!

[ad_1]

Stock Market Closing 20 July 2023:

స్టాక్‌ మార్కెట్లు గురువారం ఇరగదీశాయి. ఉదయం స్తబ్దుగా కదలాడినా ఆఖరికి భారీ లాభాలు నమోదు చేశాయి. గ్లోబల్‌ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 146 పాయింట్లు పెరిగి 19,979 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 474 పాయింట్లు పెరిగి 67,571 వద్ద ముగిశాయి. బ్యాంకు, ఫైనాన్స్‌ షేర్లు బాగా ర్యాలీ అయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైసలు పెరిగి రూ.81.99 వద్ద స్థిరపడింది. స్మాల్‌, మిడ్‌క్యాప్‌ సూచీలు అండర్‌ పెర్ఫామ్‌తో ముగిశాయి.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 67,097 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 67,074 వద్ద మొదలైంది. 66,831 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 67,619 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 474 పాయింట్ల లాభంతో 67,571 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

బుధవారం 19,833 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 19,841 వద్ద ఓపెనైంది. 19,758 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,991 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 146 పాయింట్లు పెరిగి 19,979 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 45,689 వద్ద మొదలైంది. 45,640 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 46,256 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 517 పాయింట్లు పెరిగి 46,186 వద్ద ముగిసింది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 38 కంపెనీలు లాభాల్లో 12 నష్టాల్లో ఉన్నాయి. ఐటీసీ, కొటక్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంకు, డాక్టర్‌ రెడ్డీస్‌, గ్రాసిమ్‌ షేర్లు లాభపడ్డాయి. ఇన్ఫీ, అల్ట్రాటెక్‌ సెమ్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐచర్‌ మోటార్స్‌, బ్రిటానియా షేర్లు నష్టపోయాయి. ఐటీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు మినహా అన్నీ పెరిగాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌, ప్రైవేటు బ్యాంకు, హెల్త్‌కేర్‌ సూచీలు బాగా పెరిగాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.60,750 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.78,400 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.290 తగ్గి రూ.25,630 వద్ద ఉంది.

Also Read: ఉద్యోగుల్ని భయపెట్టేందుకు! టాప్‌ పెర్ఫార్మర్‌ను పీకేసిన కంపెనీ!

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *