[ad_1]
Stock Market Update: బ్రోకింగ్ కంపెనీ యాక్సిస్ సెక్యూరిటీస్, లార్జ్ &మిడ్ క్యాప్ స్టాక్స్ సెగ్మెంట్స్ నుంచి కొన్ని స్టాక్స్‌ను ఎంచుకుంది, వాటిపై సానుకూలంగా ఉంది. ఆ కౌంటర్లలో లక్ష్మీకళ ఉట్టి పడుతోందని, 34% వరకు ర్యాలీ చేయగలవని బ్రోకింగ్ కంపెనీ చెబుతోంది. యాక్సిస్ సెక్యూరిటీస్ టాప్ పిక్స్‌లో బ్యాంకింగ్, ఆటో, ఫార్మా వంటి విభిన్న రంగాల స్క్రిప్స్ ఉన్నాయి. ఇండివిడ్యువల్‌గా చూస్తే… ICICI బ్యాంక్, SBI, మారుతి సుజుకి, అశోక్ లేలాండ్, ITC వంటి ఫేమస్ నేమ్స్ కనిపిస్తాయి.
యాక్సిస్ సెక్యూరిటీస్ టాప్ 10 స్టాక్ పిక్స్:
ICICI బ్యాంక్ | ప్రస్తుత మార్కెట్ ప్రైస్: రూ. 931
ICICI బ్యాంక్‌పై బయ్ సిఫార్సు కంటిన్యూ చేసిన యాక్సిస్ సెక్యూరిటీస్, రూ. 1,250 ప్రైస్ టార్గెట్‌ను ప్రకటించింది. ప్రస్తుత మార్కెట్ ప్రైస్ నుంచి ఈ స్టాక్ మరో 34% పెరుగుతుందన్నది బ్రోకరేజ్ అంచనా.
మారుతి సుజుకి | ప్రస్తుత మార్కెట్ ప్రైస్: రూ. 10,135
మారుతి సుజుకిపై బయ్ రేటింగ్ కొనసాగించిన బ్రోకరేజ్ సంస్థ, రూ. 11,800 టార్గెట్ ధరను ఇచ్చింది. ప్రస్తుత మార్కెట్ ధర నుంచి ఇది 16% ర్యాలీ చేయగలదని ఈ టార్గెట్ ప్రైస్ అర్ధం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా | ప్రస్తుత మార్కెట్ ప్రైస్: రూ 586
ప్రస్తుత స్థాయిలో SBI షేర్లను కూడా కొనవచ్చని చెబుతున్న యాక్సిస్ సెక్యూరిటీస్, బయ్ రేటింగ్ + రూ. 715 టార్గెట్ ధరను కొనసాగించింది. ఇది ప్రస్తుత స్థాయి నుంచి 22% అప్‌సైడ్ పొటెన్షియల్‌ను సూచిస్తోంది.
వరుణ్ బెవరేజెస్ | ప్రస్తుత మార్కెట్ ప్రైస్: రూ 919
వరుణ్ బెవరేజెస్‌కు రూ. 1,050 టార్గెట్ ధరను యాక్సిస్ సెక్యూరిటీస్ డిసైడ్ చేసింది. ప్రస్తుత మార్కెట్ ధర నుంచి మరో 14% అప్‌సైడ్ వెళ్తుందని దీని అర్ధం.
బ్యాంక్ ఆఫ్ బరోడా | ప్రస్తుత మార్కెట్ ప్రైస్: 212
బ్యాంక్ ఆఫ్ బరోడాకు బ్రోకింగ్ ఫర్మ్ ఇచ్చిన టార్గెట్ 255 రూపాయలు. ఈ స్టాక్ ప్రస్తుత మార్కెట్ ధర నుంచి 20% జంప్ చేయవచ్చని ఈ టార్గెట్ ప్రైస్ సూచిస్తోంది.
ITC | ప్రస్తుత మార్కెట్ ప్రైస్: రూ 436
ITCపై రూ. 540 టార్గెట్ ధరను యాక్సిస్ సెక్యూరిటీస్ కలిగి ఉంది, ఈ కౌంటర్ మరో 24% లాభాలను కళ్ల జూసే అవకాశం ఉందన్నది టార్గెట్ ధర లెక్క.
లుపిన్ | ప్రస్తుత మార్కెట్ ప్రైస్: రూ. 1,151
లుపిన్‌కు రూ. 1,290 టార్గెట్ ధరను ఇచ్చింది, ప్రస్తుత మార్కెట్ ధర నుంచి 12% అప్‌సైడ్ పొటెన్షియల్‌ను ఇది చూపుతోంది.
ఫెడరల్ బ్యాంక్ | ప్రస్తుత మార్కెట్ ప్రైస్: రూ 147
ఫెడరల్ బ్యాంక్ మీద బయ్ రేటింగ్ కొనసాగించిన బ్రోకరేజ్ ఫర్మ్, రూ. 165 టార్గెట్ ధరను ప్రకటించింది. ఈ స్టాక్ ప్రస్తుత మార్కెట్ ధర నుంచి 12% పెరగవచ్చని సూచించింది.
అశోక్ లేలాండ్ | ప్రస్తుత మార్కెట్ ప్రైస్: రూ 173
అశోక్ లేలాండ్ షేర్లను కూడా ప్రస్తుత స్థాయిలో కొనవచ్చని చెబుతున్న యాక్సిస్ సెక్యూరిటీస్, రూ. 210 టార్గెట్ ధరను ప్రకటించింది. ప్రస్తుత మార్కెట్ ధర నుంచి 21% అప్‌సైడ్ చేరొచ్చని దీని భావన.
రిలాక్సో పుట్‌వేర్ | ప్రస్తుత మార్కెట్ ప్రైస్: రూ 906
రిలాక్సో ఫుట్‌వేర్ షేర్లకు యాక్సిస్ సెక్యూరిటీస్ ఇచ్చిన టార్గెట్ ధర రూ. 1,050. ప్రస్తుత మార్కెట్ ధర నుంచి 16% ర్యాలీ చేయొచ్చన్నది ఈ టార్గెట్ ప్రైస్ అర్ధం.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ఈ ఉద్యోగంలో రూ.83 లక్షల జీతం, పిల్లలతో కలిసి ఆడుకోవడమే పని, మీరు కూడా అప్లై చేయొచ్చు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
[ad_2]
Source link
Leave a Reply