డయాబెటిక్‌ పేషెంట్స్‌ రాత్రి పూట మిగిలిన చపాతీ.. బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది..!

[ad_1]

​Diabetes Control: చాలా మంది రాత్రిపూట మిగిలిన చపాతీ, రోటీలను బయట పారేస్తూ ఉంటారు, లేకపోతే జుంతువులకు వేస్తూ ఉంటారు. రాత్రంతా నిల్వ ఉన్న చపాతీ, రీటీలను ఉదయం పూట తింటే ఆరోగ్యం పాడవుతుందని అనుకుంటూ ఉంటారు. కానీ రాత్రి పూట మిగిలిన రోటీ, చపాతీలను ఉదయం పూట తింటే ఆరోగ్యనికి ఎంతో మేలు జరుగుతుందని మీకు తెలుసా..? రాత్రి మిగిలిన చపాతీలు ఉదయం పూట తింటే.. డయాబెటిస్‌ కంట్రోల్‌లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది..

షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది..

షుగర్‌ పేషెంట్స్‌ రాత్రి పూట మిగిలిన చపాతీలు ఉదయం పూట తింటే మంచిదని ఆయుర్వేద డాక్టర్‌ కపిల్‌ త్యాగి . (Dr. Kapil Tyagi, director of ‘Kapil Tyagi Ayurved Clinic) అన్నారు. ఇవి మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికీ మేలు చేస్తాయన్నారు. రాత్రిపూట వాటిలోని స్టార్చ్‌ నిరోధకత పెరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. మీ బ్రేక్‌ ఫాస్ట్‌లో పాలు, కూరలతో కలపి ఇవి తీసుకుంటే.. డయబెటిస్‌ కంట్రోల్‌లో ఉంటుంది. ఇవి 12 నుంచి 15 గంటల లోపు మాత్రమే నిల్వ ఉన్న రోటీలను తినాలి.
నిల్వ ఉన్న రోటీ, చపాతీలు.. 12 గంటల పాటు గాలికి ఎక్స్‌పోజ్‌ అవుతాయి. వాటి రుచి, ఆకృతి, స్టార్చ్‌ నిర్మాణంలోనూ మార్పు వస్తుంది. దీంతో స్టార్చ్‌.. ఒక నిరోధక ఫైబర్‌గా పనిచేస్తుంది. ఇది త్వరగా గ్లూకోజ్‌గా మారదు. ఫ్రెష్‌, నిల్ల ఉన్న రోటీల గ్లైసెమిక్ ఇండెక్స్‌ల మధ్యలోనూ చాలా తేడా ఉంటుంది. నిల్వ ఉన్న రోటీలు.. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచవు.
హై బ్లడ్ షుగర్ సమస్యతో బాధపడేవారు.. నిల్వ ఉన్న రోటీలు తప్పక తినాలని డాక్టర్‌ కపిల్‌ త్యాగి సూచిస్తున్నారు. మీరు రాత్రి పూట మిగిలన చపాతీలను ఉదయం పాలలో 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టి తింటే.. చాలా మంచిది.

Also Read: ఈ ఐదు పనులు మానేస్తే.. 15 రోజుల్లో షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది..!

డయాబెటిస్‌ ఎందుకొస్తుంది..?

డయాబెటీస్ ఎందుకొస్తుంది..

జీర్ణవ్యవస్థకూ మంచిదే..

జీర్ణవ్యవస్థకూ మంచిదే..

నిల్వ ఉన్న చపాతీలు, రోటీలు కడుపుకు కూడా మేలు చేస్తాయి. తరచుగా జీర్ణసమస్యలతో బాధపడేవారికి నిల్వ ఉన్న రోటీలు బెస్ట్‌ ఆప్షన్‌. రాత్రి నిద్రపోయే ముందు మిగిలిన చపాతీలను పాలలో నానబెట్టి.. ఉదయం పూట తింటే మలబద్ధకం, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్‌ వంటి జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. ఇందులో ఉండే ఫైబర్‌ మలబద్ధకం నుంచి ఉపశమనం ఇస్తుంది. (image source – pixabay)

శరీర ఉష్ణోగ్రత అదుపులో ..

శరీర ఉష్ణోగ్రత అదుపులో ..

కాచి చల్లార్చిన పాలలో రాత్రి మిగిలన రోటీలను నానబెట్టి తినడం వల్ల.. శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. పాలు, రోటీ కాంబినేషన్‌.. మీకు పోషకాలను పుష్కలంగా అందిస్తుంది.

(image source – pixabay)

బీపీ కంట్రోల్‌లో ఉంటుంది..

బీపీ కంట్రోల్‌లో ఉంటుంది..

రాత్రి మిగిలిన రోటీలు పాలలో కలిపి ఉదయం పూట తీసుకుంటే హైపర్‌టెన్షన్‌ తగ్గుతుందని డాక్టర్‌ కపిల్‌ త్యాగి అన్నారు. మీరు అధిక రక్తపోటుతో బాధపడుతుంటే.. ఇది మీ బ్రేక్‌ఫాస్ట్‌కు బెస్ట్‌ ఆప్షన్‌. (image source – pixabay)

Also Read: ఈ టిప్స్‌ ఫాలో అయితే.. హైబీపీ కంట్రోల్‌లో ఉంటుంది
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *