[ad_1]
దాల్చిన చెక్క నీరు..
వంటగదిలో ఉండే సుగంధ ద్రవ్యాలలో దాల్చిన చెక్క ఒకటి. టైప్ -2 డయాబెటిస్‌తో బాధపడుతున్న ప్రజలలో రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడానికి ఇందులోని ఔషధ గుణాలు సహాయపడతాయి. దాల్చిన చెక్కలో ఉండే క్రోమియం శరీరంలోని గ్లూకోజ్ స్థాయుల్ని న్యూట్రల్ చేస్తుంది. దాల్చినచెక్కలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే.. పాలీఫెనాల్స్ గ్లూకోజ్ స్థాయులను తగ్గిస్తాయి. దాల్చిన చెక్క వాటర్ శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది.
ఎలా తీసుకోవాలి..
దాల్చిన చెక్కను గ్రైండ్ చేసి పొడిలా చేసుకోవాలి. రాత్రి నిద్రపోయే ముందు నీళ్లోలో పావు టీస్పూన్ పొడి వేసి.. ఉంచండి. మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగాలి. ఇది శరీరంలోని వ్యర్థాలను తొలగించి.. బాడీని క్లీన్ చేస్తుంది.
అల్లం వాటర్..
అల్లంలో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఇన్సులిన్ స్రావాన్ని పెంచుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్లు తమ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని అదుపులో, స్థిరంగా ఉంచుకోవడంలో సహాయపడతాయి. అల్లం శరీరంలోని వ్యర్థాలనూ తొలగిస్తుంది.
ఎలా తీసుకోవాలి..
తాజా అల్లం ముక్కను నీళ్లలో మరిగించి వడకట్టిన తర్వాత తాగాలి. దీనికి ఎలాంటి స్వీటెనర్ యాడ్ చేయవద్దు.
తులసి వాటర్..
మెసిడోనియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ సైంటిస్ట్స్ ప్రచురించిన ఓ అధ్యయనంలో తులసి డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంచుతుందని పేర్కొంది. ఔషధ గుణాలు పుష్కలంగా ఉండే.. తులసి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయని స్పష్టం చేశారు. తులసి వల్ల పాంక్రియాటిక్ బీటా కణాల పనితీరు, ఇన్సులిన్ స్రవించే విధానం మెరుగుపడుతుందని ఇతర అధ్యయనాల్లో తేలింది. తులసి ఆకుల్లో హైపోగ్లైసిమిక్ లక్షణాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. తులసి వాటర్ శరీరంలో పేరుకున్న వ్యర్థాలను తొలగిస్తుంది.
ఎలా తీసుకోవాలి
6-8 తులసి ఆకులను నీటిలో వేసి 5 నిమిషాలు మరిగించండి. ఈ నీళ్లు గోరువెచ్చగా అయిన తర్వాత తాగితే మంచిది.
ఉల్లిపాయ వాటర్..
ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ ఇన్‌సైట్స్ జర్నల్ ప్రకారం, ఉల్లిపాయలు టైప్-1 డయాబెటిస్, టైప్-2 డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. ఉల్లిపాయ వాటర్‌ను తాగితే శరీరంలోని వ్యర్థాలు క్లీన్ అవుతాయి. షుగర్ పేషెంట్స్ ఉల్లిపాయ వాటర్ తాగితే.. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి.
ఎలా తీసుకోవాలి..
రెండు పచ్చి ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా తరిగి, ఒక స్టీలు గిన్నెలో ఉంచండి. దానికి లీటరుపైగా నీళ్లు చేర్చి.. ఒక గంట వదిలేయండి. తర్వాత ఆ నీటిని తాగితే సరి. లేదూ ఆ మిశ్రమాన్ని రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచి, మరుసటి రోజు చల్లదనం తగ్గాకైనా తీసుకోవచ్చు.
మెంతుల వాటర్..
మెంతులు రక్తంలోని చక్కెర స్థాయులు నియంత్రించడంలో సహాయపడతాయి. మెంతులు జీర్ణక్రియను, పిండి పదార్థాలను గ్రహించుకోవటాన్ని నెమ్మదిచేస్తుంది. ఇలా రక్తంలో గ్లూకోజు నెమ్మదిగా కలిసేలా చేస్తుంది. దీనివల్ల గ్లూకోజ్ కంట్రోల్‌లో ఉంటుంది. మెంతుల్లో 4-హైడ్రాక్సిస్‌ల్యూసిన్ అనే అమైనో ఆల్కనాయిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది, కణాలు ఇన్సులిన్‌ను తీసుకునేలా చేస్తుంది. వీటిలో 2-ఆక్సోగ్లుటేట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవి ఇన్సులిన్‌ను ప్రేరేపిస్తుంది, దీనివల్ల గ్లూకోజ్ అదుపోలో ఉంటుంది.
ఎలా తీసుకోవాలి..?
రాత్రి పూట ఒక టీస్పూన్ మెంతి గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం వడగట్టి ఖాళీకడుపోతో తాగాలి.
వేప నీరు..
వేపలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీవైరల్ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. ఎథ్నో-మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం ఇది డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. శరీరంలోని వ్యర్థాలనూ వేప నీరు.. తొలగిస్తుంది.
ఎలా తీసుకోవాలి
ఐదు వేపాకులను గ్లాసు నీళ్లలో ఐదు నిమిషాలు మరిగించండి. ఇది గోరువెచ్చగా అయిన తర్వాత.. ఆ నీళ్లు తాగాలి.
కరివేపాకు వాటర్..
రక్తంలో చక్కెరను నియంత్రించడానికి కరివేపాకు సహాయపడుతుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్ గుణాలు.. ఆహారంలోని పిండి పదార్తాన్ని.. గ్లూకోజ్‌గా మార్చడాన్ని నిరోధిస్తుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
ఎలా తీసుకోవాలి..
ఒక రెబ్బ కరివేపాకు తీసుకుని, గ్లాస్ నీటిలో వేసి మరిగించండి. ఈ నీళ్లు గోరువెచ్చగా అయిన తర్వాత.. ఖాళీ కడుపుతో తాగితే మంచిది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో 4 లేదా 5 కరివేపాకు నమిలినా మంచిదే.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply