దుర్భర పరిస్థితుల్లో వొడాఫోన్‌ ఐడియా, ₹7 వేల కోట్ల అప్పు కోసం నానా తిప్పలు

[ad_1]

Vodafone Idea: అప్పుల్లో కూరుకుపోయి దారుణ పరిస్థితుల్లో ఉన్న వొడాఫోన్ ఐడియా (Vi) రూ. 7,000 కోట్ల వరకు రుణాలు పొందేందుకు కొన్ని బ్యాంకులను సంప్రదించినట్లు జాతీయ మీడియా ద్వారా తెలుస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లను ఈ టెల్కో సంప్రదించినట్లు సమాచారం.

అయితే.. ఆ కంపెనీలో కేంద్ర ప్రభుత్వ షేర్‌ హోల్డింగ్, మూలధన అవసరాల గురించి వొడాఫోన్‌ ఐడియా నుంచి మరింత స్పష్టతను బ్యాంకులు కోరాయి. ఇండస్‌ టవర్స్‌కు (Indus Towers) వొడాఫోన్‌ ఐడియా వేల కోట్ల రూపాయలు బకాయి ఉంది. ఈ కంపెనీకి చెందిన టవర్స్‌ను వినియోగించున్నందుకు ఈ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాల్లో ఎక్కువ భాగాన్ని, ఇండస్ టవర్స్‌కు ఉన్న బకాయిల్లో కొంత మొత్తాన్ని భర్తీ చేయడానికి వొడాఫోన్‌ ఉపయోగిస్తుంది. 

ఇండస్ టవర్స్‌కు వొడాఫోన్‌ ఐడియా చెల్లించాల్సిన బకాయి రూ. 7,500 కోట్లు. 2023 జనవరి నుంచి విడతల వారీగా 100 శాతం బకాయిలు చెల్లిస్తామని ఈ టెలికాం కంపెనీ, టవర్ కంపెనీకి మాట ఇచ్చింది. మాట నిలబెట్టుకోలేక బకాయిలను క్లియర్ చేయడంలో టెలికాం కంపెనీ విఫలమైతే, టవర్ సైట్‌లకు యాక్సెస్‌ను కోల్పోవాల్సి వస్తుందని వొడాఫోన్‌ ఐడియాను ఇండస్ టవర్స్ గతంలోనే హెచ్చరించింది.

ధృవీకరించిన బ్యాంక్‌లు
“రుణం కోసం వొడాఫోన్‌ ఐడియా అధికారులు మమ్మల్ని సంప్రదించారు. కానీ, మేం వారికి ఏమీ మాట ఇవ్వలేదు. ప్రతిష్టంభన కొనసాగుతోంది” అని ఒక బ్యాంక్‌ సీనియర్ అధికారి చెప్పారు. రూ. 15,000 కోట్లను బ్యాంక్ గ్యారెంటీగా అందించాలని, దీంతోపాటు తాజా రుణాలు మంజూరు చేయాలని తమను Vi కోరినట్లు మరో బ్యాంకర్ చెప్పారు.

live reels News Reels

“ప్రతికూల నికర విలువ” (negative net worth) ఉన్న కంపెనీకి రుణం ఇవ్వలేమని మరో అధికారి సమాధానం చెప్పినట్లు జాతీయ మీడియా రిపోర్ట్‌ చేసింది. 2022 సెప్టెంబర్ త్రైమాసికం ముగింపు నాటికి, వొడాఫోన్‌ ప్రతికూల నికర విలువ రూ. 75,830 కోట్లుగా ఉంది.

“జనవరి నుంచి, చెప్పిన సమయానికి ఇండస్‌ టవర్స్‌కు వొడాఫోన్‌ ఐడియా చెల్లింపులు చేయలేకపోతే, ఇండస్‌ టవర్స్‌ నుంచి కఠినమైన చర్యను ఎదుర్కోవలసి ఉంటుంది. పరిస్థితులు తీవ్రంగా మారతాయి. బకాయిలను రికవరీ చేయడానికి బలమైన చర్యలు తీసుకునేలా ఇండస్ టవర్స్‌ బోర్డ్‌ సమావేశంలో చర్చిస్తారు. ఈ నెలాఖరులో బోర్డు సమావేశం ఉంది” అని ఈ విషయాల గురించి అవగాహన ఉన్న ఒక అధికారి వెల్లడించారు.

ఇండస్ టవర్స్‌తో పాటు నోకియా (Nokia), ఎరిక్‌సన్‌కు (Ericsson) కూడా వొడాఫోన్‌ ఐడియా బాకీ ఉంది. వీటికి కూడా ఇప్పుడు అత్యవసర చెల్లింపులు చేయాల్సి ఉంది. ప్రతి నెలా తగ్గి పోతున్న కస్టమర్ల సంఖ్యకు అడ్డుకట్ట వేయడానికి, కస్టమర్లను నిలబెట్టుకునేలా 5G సేవలను తీసుకురావడానికి, ఇప్పటికే ఉన్న 4G కవరేజీని మరింత విస్తరించడానికి కూడా వొడాఫోన్‌ ఐడియాకి ఇప్పుడు నిధులు అత్యవసరం.

వొడాఫోన్‌ ఐడియా షేర్‌ ధర గత నెల రోజుల కాలంలో దాదాపు 4%, గత ఆరు నెలల కాలంలో దాదాపు 10%, గత ఏడాది కాలంలో దాదాపు 50% పతనమైంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *