నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ Vs అటల్‌ పెన్షన్‌ యోజన – తేడాలు, అర్హతలు, బెనిఫిట్స్‌

[ad_1]

Pension Plans: రిటైర్మెంట్‌ తర్వాతి జీవితం, నెలవారీ ఆదాయం గురించి ముందు నుంచే ఒక ప్లాన్‌ లేకపోతే భవిష్యత్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మన దేశంలో, ఉద్యోగ సమయంలో దర్జాగా బతికిన వాళ్లు, రిటైర్మెంట్‌ ప్లానింగ్‌ లేకపోవడం వల్లే తర్వాతి కాలంలో నానా కష్టాలు పడుతున్నారు. వయస్సు మీద పడడం వల్ల, అనారోగ్య కారణాలతో ఉద్యోగం/వృత్తి/వ్యాపారాల నుంచి తప్పుకున్న ప్రజలు ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు పడకుండా కేంద్ర ప్రభుత్వం వివిధ పెన్షన్‌ ప్లాన్స్‌ అమలు చేస్తోంది. వాటిలో ‘నేషనల్ పెన్షన్ సిస్టమ్’ (NPS) బాగా పాపులర్ అయింది. అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం ‘అటల్‌ పెన్షన్‌ యోజన’ను (APY) సెంట్రల్‌ గవర్నమెంట్‌ రన్‌ చేస్తోంది.

నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ Vs అటల్‌ పెన్షన్‌ యోజన: 

– 8 ఏళ్ల నుంచి 70 సంవత్సరాల వయస్సు ఉన్న ఎవరైనా ఎన్‌పీఎస్‌ ఖాతా ప్రారంభించవచ్చు. జీతం తీసుకునే ఉద్యోగులు మాత్రమే కాకుండా ఇతర వ్యక్తులు కూడా నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌లో సభ్యులు కావచ్చు. అటల్‌ పెన్షన్‌ యోజన కింద ఖాతా స్టార్ట్‌ చేయాలంటే ఒక వ్యక్తికి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. వివిధ రంగాల్లో పని చేస్తున్న స్వల్ప ఆదాయ కార్మికుల (అసంఘటిత రంగ కార్మికులు) కోసం ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ స్కీమ్‌ కింద, చిన్న చిన్న పనులు చేసుకునే వ్యక్తులు కూడా ఉద్యోగస్తుల తరహాలోనే నెలనెలా పెన్షన్‌ పొందొచ్చు.

– నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయడానికి ప్రతి భారతీయుడు అర్హుడే. NRIలకు (నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్‌) కూడా అర్హత ఉంది. అటల్‌ పెన్షన్‌ యోజన విషయానికి వస్తే.. ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ (ITR) ఫైల్‌ చేయని భారతీయులకు మాత్రమే ఈ ఖాతాను ప్రారంభించడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. 

– NSP అకౌంట్‌లో, ఒక ఫైనాన్షియల్‌ ఇయర్‌లో కనీసం వెయ్యి రూపాయలు డిపాజిట్‌ చేయాలి, స్థోమతను బట్టి గరిష్టంగా ఎంతైనా జమ చేయవచ్చు. APY కింద, 18 సంవత్సరాల వయస్సులో జాయిన్‌ అయినవాళ్లు కనిష్టంగా 42 రూపాయల నుంచి గరిష్టంగా 210 రూపాయల వరకు అకౌంట్‌లో జమ చేసే వీలుంది. 40 ఏళ్ల వయసులో చేరితే మాత్రం కనిష్టంగా 291 రూపాయల నుంచి గరిష్టంగా 1454 రూపాయల వరకు డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది.

– NSPలో ఖాతాదారు జమ చేసే మొత్తానికి సెంట్రల్‌ గవర్నమెంట్‌ తరపున ఒక్క రూపాయి కూడా కాంట్రిబ్యూషన్‌ ఉండదు. APY మొత్తానికి మాత్రం కొంత కాంట్రిబ్యూషన్‌ ఉంటుంది.

– NSP ద్వారా వచ్చే పెన్షన్‌కు కచ్చితమైన లెక్కంటూ ఏదీ లేదు. రిటర్న్స్‌ ఆధారంగా నెలవారీ మొత్తం చేతికి వస్తుంది. APYలో… అకౌంట్‌ హోల్డర్‌కు 60 ఏళ్ల వయస్సు వచ్చిన నాటి నుంచి, పెట్టిన పెట్టుబడిని బట్టి, నెలకు వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు అందుకుంటారు. 

– NSPలో టైర్‌-1, టైర్‌-2 అని రెండు రకాల అకౌంట్స్‌ ఉంటాయి. ప్రతి సబ్‌స్క్రైబర్‌ ముందు టైర్‌-1 అకౌంట్‌ ఓపెన్‌ చేయాలి. టైర్‌-2 అకౌంట్‌ ఓపెన్‌ చేయడం పూర్తిగా అకౌంట్‌ హోల్డర్‌ ఇష్టం. APYలో రకరకాల ఖాతాలు ఉండవు, ఒకే ఒక్క అకౌంట్‌ ఉంటుంది.

– NSPలో పెట్టిన పెట్టుబడిని మధ్యలోనే వెనక్కు తీసుకోవాలంటే కొన్ని రూల్స్‌ వర్తిస్తాయి. టైర్‌-2 అకౌంట్‌లో జమ చేసిన మొత్తాన్ని ఎలాంటి షరతులు లేకుండా విత్ర్‌ డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ, రిటైర్మెంట్‌ కంటే ముందే సబ్‌స్రైబర్‌ మరణిస్తే.. అకౌంట్‌లో (టైర్‌-1, టైర్‌-2) ఉన్న డబ్బును నామినీకి చెల్లిస్తారు. ఒకవేళ నామినీ పేరు లేకపోతే, చట్టబద్ధమైన వారసుడికి అప్పజెపుతారు. APY ఖాతాలో జమ చేసే మొత్తాన్ని ముందుగానే విత్‌డ్రా చేసుకోవడం కుదరదు. 60 సంవత్సరాల వయస్సు కంటే ముందే అకౌంట్‌ హోల్డర్‌ మరణిస్తే నామినీకి లేదా చట్టబద్ధమైన వారసుడికి డబ్బు చెల్లిస్తారు. ఒకవేళ, అకౌంట్‌ హోల్డర్‌కు ప్రాణాంతక పరిస్థితుల్లో వైద్యం చేయించ్చినా ముందుగానే డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశం లభిస్తుంది.

– NSP టైర్‌-1 అకౌంట్‌లో జమ చేసే మొత్తానికి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల వరకు టాక్స్‌ బెనిఫిట్స్‌ పొందొచ్చు. ITR ఫైల్‌ చేసే వాళ్లకు APYలో చేరే అర్హత ఉండదు కాబట్టి, టాక్స్‌ బెనిఫిట్స్‌ అన్న మాటే ఈ స్కీమ్‌లో వినిపించదు.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు – ఇవాళ్టి రేట్లివి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *