[ad_1]
Stock Market Opening 10 January 2023:
భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనం వంటివి మదుపర్లలో నెగెటివ్ సెంటిమెంటుకు దారితీశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 154 పాయింట్ల నష్టంతో 17,946 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 541 పాయింట్ల నష్టంతో 60,206 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 60,747 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,805 వద్ద మొదలైంది. 60,181 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,809 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 541 పాయింట్ల నష్టంతో 60,206 వద్ద కొనసాగుతోంది.
News Reels
NSE Nifty
సోమవారం 18,101 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 18,121 వద్ద ఓపెనైంది. 17,946 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,127 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 154 పాయింట్ల నష్టంతో 17,946 వద్ద నడుస్తోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 42,642 వద్ద మొదలైంది. 42,063 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,674 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 517 పాయింట్లు తగ్గి 42,065 వద్ద ట్రేడవుతోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 17 కంపెనీలు లాభాల్లో 33 నష్టాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్, అపోలో హాస్పిటల్స్, ఓఎన్‌జీసీ, హిందాల్కో, దివిస్ ల్యాబ్ షేర్లు ఎగిశాయి. భారతీ ఎయిర్టెల్, ఐచర్ మోటార్స్, టీసీఎస్, ఎస్‌బీఐ, అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు నష్టపోయాయి. ఆటో, ఫార్మా, హెల్త్‌కేర్ సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎరుపెక్కాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link
Leave a Reply