[ad_1]
Stock Market Opening 08 December 2022:
భారత స్టాక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. మదుపర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 21 పాయింట్ల లాభంతో 18,581 బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 57 పాయింట్ల లాభంతో 62,467 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 62,410 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 62,504 వద్ద మొదలైంది. 62,320 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,633 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 57 పాయింట్ల లాభంతో 62,467 వద్ద కొనసాగుతోంది.
News Reels
NSE Nifty
బుధవారం 18,560 వద్ద ముగిసిన ఎన్ఎస్ఈ నిఫ్టీ గురువారం 18,570 వద్ద ఓపెనైంది. 18,536 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,625 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 21 పాయింట్ల లాభంతో 18,581 వద్ద చలిస్తోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ఉంది. ఉదయం 43,142 వద్ద మొదలైంది. 43,095 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,402 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 276 పాయింట్లు ఎగిసి 43,375 వద్ద ట్రేడవుతోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 29 కంపెనీలు లాభాల్లో 21 నష్టాల్లో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఐచర్ మోటార్స్, ఎల్టీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎం అండ్ ఎం షేర్లు లాభపడ్డాయి. సన్‌ఫార్మా, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, కొటక్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ నష్టపోయాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link
Leave a Reply