ఫ్లాట్‌.. ఫ్లాట్‌! ఊగిసలాడిని సెన్సెక్స్‌, నిఫ్టీ – బ్యాంకు షేర్లు పతనం!

[ad_1]

Stock Market Closing 24 January 2023:

భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఐటీ రంగ షేర్లకు డిమాండ్‌ కనిపించింది. పీఎస్‌యూ షేర్లు వరుసగా పతనమవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 1 పాయింట్ల లాభంతో 18,188 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 37 పాయింట్ల లాభంతో 60,978 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 33 పైసలు బలహీనపడి 81.72 వద్ద స్థిరపడింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 60,941 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 61,122 వద్ద మొదలైంది. 60,849 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,266 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 37 పాయింట్ల లాభంతో 60,978 వద్ద ముగిసింది.

news reels

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

సోమవారం 18,188 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 18,183 వద్ద ఓపెనైంది. 18,078 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,201 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తం 1 పాయింట్ల లాభంతో 18,188 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 42,994 వద్ద మొదలైంది. 42,615 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,078 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 87 పాయింట్లు తగ్గి 42,733 వద్ద స్థిరపడింది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 21 కంపెనీలు లాభాల్లో 29 నష్టాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్‌, మారుతీ, బజాజ్‌ ఆటో, బ్రిటానియా, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు లాభపడ్డాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, హిందాల్కో, డాక్టర్‌ రెడ్డీస్‌, పవర్‌ గ్రిడ్‌, ఎస్‌బీఐ లైఫ్‌ షేర్లు నష్టపోయాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎగిశాయి. బ్యాంకు, మెటల్‌, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎరుపెక్కాయి. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Also Read: బడ్జెట్‌ తర్వాత భారీగా పెరిగే సత్తా ఉన్న 10 స్టాక్స్‌ ఇవి, ముందే కొనమంటున్న ఎక్స్‌పర్ట్స్‌

Also Read: జొమాటోలో 800 జాబ్స్‌ – సాఫ్ట్‌వేర్‌, ప్రొడక్ట్‌ మేనేజర్లు, మినీ సీఈవో పోస్టులు!

Also Read: బ్యాంక్‌ కష్టమర్లకు పెద్ద ఊరట, లాకర్ కొత్త అగ్రిమెంట్ల గడువు పెంపు



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *