PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

బడ్జెట్‌ తర్వాత పెరిగే స్టాక్స్‌ ఇవి, ముందే కొని పెట్టుకోమంటున్న ఎక్స్‌పర్ట్స్‌

[ad_1]

Budget 2023 Picks: 2023లో ఇప్పటివరకు, ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FIIలు) చేసిన వేల కోట్ల రూపాయల విక్రయాలతో నిఫ్టీ 2.8 శాతం క్షీణించింది. లార్జ్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్, స్మాల్‌ క్యాప్‌ ఇలా అన్ని కేటగిరీల స్టాక్స్ నేలచూపులు చూశాయి. అయితే, యూనియన్ బడ్జెట్ 2023 నేపథ్యంలో కొన్ని కౌంటర్లు లాభాలను కళ్ల చూస్తాయని బ్రోకరేజ్ సంస్థ షేర్‌ఖాన్ (Sharekhan) చెబుతోంది. యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఎం&ఎం వంటి స్టాక్స్ ఇన్వెస్టర్లకు మంచి అవకాశాలను అందిస్తాయని బ్రోకరేజ్ సంస్థ నమ్మకంగా ఉంది. ఈ స్టాక్స్‌ టార్గెట్‌ ధరను, ర్యాలీ చేయగల సత్తాను శుక్రవారం (27 జనవరి 2023) నాటి ముగింపు ధరల ఆధారంగా బ్రోకింగ్‌ హౌస్‌ లెక్కించింది.  

షేర్‌ఖాన్ రీసెర్చ్ సిఫార్సుల ప్రకారం..  36% వరకు ర్యాలీ చేయగల 8 లార్జ్‌ & మిడ్‌ క్యాప్ స్టాక్స్‌ ఇవి:

ఎనలిస్ట్‌: సంజీవ్‌, షేర్‌ఖాన్‌ రీసెర్చ్‌ విభాగం అధిపతి

యాక్సిస్‌ బ్యాంక్‌  (Axis Bank)
శుక్రవారం నాటి ముగింపు ధర: రూ. 873
టార్గెట్‌ ధర: రూ. 1140 
ర్యాలీ చేయగల సత్తా: 31%
సిఫార్సు చేయడానికి కారణం: వాల్యుయేషన్లు రీజనబుల్‌గా ఉన్నాయి

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (State Bank of India/ SBI)
శుక్రవారం నాటి ముగింపు ధర: రూ. 540
టార్గెట్‌ ధర: రూ. 710 
ర్యాలీ చేయగల సత్తా: 31%
సిఫార్సు చేయడానికి కారణం: సెక్టార్‌ టెయిల్‌విండ్స్‌ నుంచి భారీగా లాభపడుతుందని అంచనా

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (Punjab National Bank/ PNB‌)
శుక్రవారం నాటి ముగింపు ధర: రూ. 51 
టార్గెట్‌ ధర: రూ. 64 
ర్యాలీ చేయగల సత్తా: 25%
సిఫార్సు చేయడానికి కారణం: వాల్యుయేషన్లు రీజనబుల్‌గా ఉన్నాయి

డాబర్‌ ఇండియా Dabur India Ltd
శుక్రవారం నాటి ముగింపు ధర: రూ. 563
టార్గెట్‌ ధర: రూ. 675 
ర్యాలీ చేయగల సత్తా: 20%
సిఫార్సు చేయడానికి కారణం: గ్రామీణ భారతంపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్‌ పెరగడం

మహీంద్ర & మహీంద్ర (Mahindra And Mahindra Ltd/ M&M)
శుక్రవారం నాటి ముగింపు ధర: రూ. 1,321 
టార్గెట్‌ ధర: రూ. 1550 
ర్యాలీ చేయగల సత్తా: 17%
సిఫార్సు చేయడానికి కారణం: రూరల్‌ ఎకానమీ కోసం ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయిస్తుందని అంచనా

మాక్రోటెక్‌ డెవలపర్స్‌ (Macrotech Developers Ltd/ Lodha Group) 
శుక్రవారం నాటి ముగింపు ధర: రూ. 1,014 
టార్గెట్‌ ధర: రూ. 1378 
ర్యాలీ చేయగల సత్తా: 36%
సిఫార్సు చేయడానికి కారణం: స్థిరాస్తి వ్యాపారానికి బడ్జెట్‌లో ప్రోత్సాహకాలు దక్కుతాయని అంచనా

ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌ (APL Apollo Tubes)
శుక్రవారం నాటి ముగింపు ధర: రూ. 1137 
టార్గెట్‌ ధర: రూ. 1275 
ర్యాలీ చేయగల సత్తా: 12%
సిఫార్సు చేయడానికి కారణం: PLI పథకాలకు బడ్జెట్‌ కేటాయింపులు పెరుగుతాయని అంచనా

ఫినోలెక్స్‌ కేబుల్స్‌ (Finolex Cables) 
శుక్రవారం నాటి ముగింపు ధర: రూ. 541 
టార్గెట్‌ ధర: రూ. 660 
ర్యాలీ చేయగల సత్తా: 22%
సిఫార్సు చేయడానికి కారణం: PLI పథకాన్ని 5G కేబుల్స్‌ తయారీకి విస్తరిస్తారని అంచనా

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *