[ad_1]
బీపీ కంట్రోల్‌లో ఉంటుంది..
హైపర్‌టెన్షన్‌తో బాధపడేవారికి.. బీట్‌రూట్ మేలు చేస్తుందని లవ్‌నీత్ బాత్రా అన్నారు. బీట్‌రూట్‌లో ఉన్న నైట్రేట్స్ రక్త ప్రసరణను సులభతరం చేయడమే కాకుండా మొత్తం బ్లడ్ ప్రెజర్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. దీంతో హైపర్‌టెన్షన్ నియంత్రణలో ఉంటుంది. బీపీ నియంత్రణలో ఉండడం వల్ల హార్ట్ ఎటాక్స్, స్ట్రోక్ వంటి సమస్యలేవి తలెత్తవు. . రక్త ప్రసరణ మంచిగా జరిగినప్పుడు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రోజూ ఒక గ్లాస్ బీట్‌రూట్ జ్యూస్ తాగితే.. అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు.
షుగర్‌కు చెక్..
బీట్‌రూట్‌లో ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ ఉంటుంది, ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ముఖ్యంగా, ఈ కూరగాయలలో సహజ చక్కెర కంటెంట్‌తో పాటు, ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. వీటన్నింటితో పాటు బీట్‌రూట్‌లో ఉండే పొటాషియం, ఫోలేట్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది..
బీట్‌రూట్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది పేగులో చెడు బాక్టీరియాను తొలగించి.. ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు అనుమతిస్తుంది. బీట్‌రూట్ జ్యూస్ డిటాక్స్‌లా పనిచేస్తుంది. కడుపులోని యాసిడ్స్ క్రమబద్దీకరించి జీర్ణక్రియ సాఫీగా సాగేలా చూస్తుంది.
ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది..
బీట్‌రూట్‌లో విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్–సి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుదం. బీట్‌రూట్ మన డైట్‌లో తరచుగా తీసుకుంటే.. ఇమ్యూనిటీ పెరుగుతుంది.
క్యాన్సర్‌కు చెక్..
బీట్‌రూట్‌లో యాంటీ క్యాన్సర్ గుణాలు సమద్ధిగా ఉన్నాయి. తెల్లరక్తకణాల ఉత్పత్తిని బీట్‌రూట్ ప్రేరేపిస్తుంది. ఫలితంగా అసాధారణంగా జరిగే కణవిభజనను నిరోధిస్తుంది. ఇది యాంటీ క్యాన్సర్ ఏజెంట్‌గా పనిచేస్తుందని చెప్పవచ్చు. బీట్‌రూట్‌లో బిటాలెయిన్స్ అనే పోషకం ఉంటుంది. బీట్‌రూట్‌కు ఎర్రటి రంగునిచ్చేది ఇదే. ఇదో శక్తిమంతమైన యాంటీ–ఆక్సిడెంట్. బీటాలెయిన్స్‌లో ఉన్న యాంటీక్యాన్సరస్ గుణాలు క్యాన్సర్ కణాలతో పోరాడతాయి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply