బ్యాంక్‌ వడ్డీ రేట్లు పెరుగుతాయా, తగ్గుతాయా?, ఆర్‌బీఐ మీటింగ్‌ ప్రారంభం

[ad_1]

RBI MPC Meet December 2023: బ్యాంక్‌ వడ్డీ రేట్లు దేశంలో కోట్లాది ప్రజలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతాయి. బ్యాంక్‌ వడ్డీ రేట్లు పెరిగితే ఇంటి బడ్జెట్‌కు చిల్లు పెరుగుతుంది, వడ్డీ రేట్లు తగ్గితే కాసిని డబ్బులు ఆదా అవుతాయి. వడ్డీ రేట్లు పెరగాలా, తగ్గాలా అని డిసైడ్‌ చేసే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ (Monetary Policy Committee – MPC) సమావేశం ఈ రోజు ప్రారంభమైంది. 

ఈ రోజు నుంచి శుక్రవారం వరకు (డిసెంబర్ 6-8 తేదీల్లో) జరిగే MPC సమావేశంలో, రెపో రేట్‌పై తన వైఖరిని ఆర్‌బీఐ నిర్ణయిస్తుంది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das) నేతృత్వంలో, ఆరుగురు సభ్యుల MPC భేటీ జరుగుతోంది. ఈ మూడు రోజుల చర్చల ఫలితాలను శుక్రవారం ఉదయం ఆర్‌బీఐ గవర్నర్ ప్రకటిస్తారు. 

రెపో రేట్‌ను ఆర్‌బీఐ పెంచితే, దేశంలో బ్యాంక్‌ వడ్డీ రేట్లు మరింత ఖరీదుగా మారతాయి. రెపో రేట్‌ తగ్గితే వడ్డీ రేట్లు దిగి వస్తాయి. రెపో రేట్‌ స్థిరంగా ఉంటే, బ్యాంక్‌ వడ్డీ రేట్లు యథాతథంగా/స్వల్ప మార్పులతో కొనసాగుతాయి.

బలంగా ఉన్న ఆర్థిక పద్దులు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ త్రైమాసికంలో భారతదేశ స్థూల జాతీయ ఉత్పత్తి ‍‌(India’s Gross Domestic Production – GDP) అంచనాలకు మించి పెరిగింది. జులై – సెప్టెంబర్ కాలంలో GDP గ్రోత్‌ రేట్‌ 6.50% ఉంటుందని రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) గతంలో అంచనా వేసింది. ఆ అంచనాలను మించి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ 7.6% చొప్పున వృద్ధి ‍‌‍‌(GDP growth rate in September 2023 quarter) చెందింది. 2023 నవంబర్‌ నెలలో జీఎస్‌టీ వసూళ్లు (GST collection in November 2023) కూడా రూ.1.68 లక్షల కోట్లకు చేరాయి, గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 15 శాతం పెరుగుదల. 

మరోవైపు… ఈ ఏడాది జులై నెల తర్వాత వరుసగా మూడో నెలలోనూ (అక్టోబర్‌) దేశంలో ద్రవ్యోల్బణం తగ్గింది. ఆహార పదార్థాల ధరల్లో పతనం కారణంగా అక్టోబర్‌ నెలలో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ (Retail Inflation In October 2023) 4.87%కు తగ్గింది. సెప్టెంబర్‌లో ఇది 5.02%, ఆగస్టులో 6.83%గా ఉంది. అంతకుముందు, జులైలోని 15 నెలల గరిష్ట స్థాయి 7.44%గా ఉంది. సరిగ్గా ఏడాది క్రితం, 2022 అక్టోబర్ నెలలో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.77%గా ఉంది.

ఎక్స్‌పర్ట్స్‌ ఏం చెబుతున్నారు?

ఆర్‌బీఐ అంచనాలను మించిన GDP వృద్ధి, బలమైన GST నంబర్‌, మెరుగుపడుతున్న ద్రవ్యోల్బణ గణాంకాలు MPC భేటీలో కీలక పాత్ర పోషిస్తాయి. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందనడానికి ఇవి గట్టి సూచనలు. ఈ నేపథ్యంలో.. ఈసారి కూడా రెపో రేటులో మార్పు ఉండదని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ భావిస్తున్నారు. 

వచ్చే ఏడాది నాలుగో త్రైమాసికం (Q4CY24) వరకు రెపో రేట్‌పై సెంట్రల్ బ్యాంక్ యథాతథ స్థితిని కొనసాగిస్తుందని భావిస్తున్నాం. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ అంచనాకు వచ్చాం – గోల్డ్‌మన్ సాచ్స్‌ 

ఉల్లి, టమోటా రేట్లు మళ్లీ పెరుగుతున్నాయి. ఆహార ద్రవ్యోల్బణం పెరిగితే మొత్తం ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. కాబట్టి, రెపో రేటును తగ్గించే ఆలోచన RBI చేయదు. అదే సమయంలో, కోర్‌ ఇన్‌ఫ్లేషన్‌ దాదాపు 4%గా ఉంది. అందువల్ల, రెపో రేటును పెంచడానికి కూడా సెంట్రల్‌ బ్యాంక్‌ వద్ద ఎలాంటి కారణం లేదు. – బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్

2022 మే – 2023 ఫిబ్రవరి నెలల మధ్య కాలంలో RBI రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచి 6.50%కి చేర్చింది. చివరిసారిగా, 2023 ఫిబ్రవరిలో రెపో రేటును 6.50%కి పెంచింది. అప్పటి నుంచి ఇదే రేటు కొనసాగుతోంది. 

గత నాలుగు ద్రవ్య విధానాల్లోనూ రెపో రేటును సెంట్రల్ బ్యాంక్ మార్చలేదు. ఈసారి కూడా అదే వైఖరిని కొనసాగిస్తే, వరుసగా ఐదోసారి కూడా రెపో రేటును మార్చకుండా యథాతథ స్థితిని కొనసాగించినట్లు అవుతుంది.

మరో ఆసక్తికర కథనం: రెండోరోజూ పసిడి పతనం – ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *