బ్రేక్‌ డాన్స్‌ చేస్తున్న సెన్సెక్స్‌! 67,097 వద్ద ముగింపు – 19,850 చేరువలో నిఫ్టీ!

[ad_1]

Stock Market Closing 19 July 2023:

స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. బెంచ్‌మార్క్‌ ఈక్విటీ సూచీలు సరికొత్త గరిష్ఠాలను అందుకున్నాయి. గ్లోబల్‌ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 83 పాయింట్లు పెరిగి 19,833 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 302 పాయింట్లు పెరిగి 67,097 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 5 పైసలు బలహీనపడి 82.09 వద్ద స్థిరపడింది. 

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 66,795 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 66,905 వద్ద మొదలైంది. 66,703 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 67,171 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 302 పాయింట్ల లాభంతో 67,097 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

మంగళవారం 19,749 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 19,802 వద్ద ఓపెనైంది. 19,727 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,851 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 83 పాయింట్లు పెరిగి 19,833 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 45,561 వద్ద మొదలైంది. 45,433 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,707 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 258 పాయింట్లు పెరిగి 45,669 వద్ద ముగిసింది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 31 కంపెనీలు లాభాల్లో 19 నష్టాల్లో ఉన్నాయి. ఎన్టీపీసీ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌,  బజాజ్ ఫిన్‌సర్వ్‌, అల్ట్రాటెక్‌ షేర్లు లాభపడ్డాయి. హిందాల్కో, హీరోమోటో, టీసీఎస్‌, బజాజ్‌ ఆటో, మారుతీ షేర్లు నష్టపోయాయి. ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, మీడియా, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు బాగా పెరిగాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.550 పెరిగి రూ.60,650 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.400 పెరిగి రూ.78,400 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.25,920 వద్ద ఉంది.

Also Read: ఆషాఢంలో వెండి రికార్డు! ఇక శ్రావణంలో కిలో రూ.85,000 చేరడం పక్కా!

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

https://publish.twitter.com/?query=https%3A%2F%2Ftwitter.com%2FNSEIndia%2Fstatus%2F1681264476920725504&widget=Tweet



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *