మళ్లీ 18,700 మీదకు నిఫ్టీ – 240 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌!

[ad_1]

Stock Market Opening 16 June 2023: 

స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ఉన్నాయి. నిన్నటి నష్టాల నుంచి కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 59 పాయింట్లు పెరిగి 18,747 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 234 పాయింట్లు ఎగిసి 63,152 వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంకు, ఫార్మా, మెటల్‌ షేర్లకు డిమాండ్‌ పెరిగింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 62,917 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 62,960 వద్ద మొదలైంది. 62,957 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 63,264 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11:30 గంటలకు 234 పాయింట్ల లాభంతో 63,152 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

గురువారం 18,688 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 18,723 వద్ద ఓపెనైంది. 18,710 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,785 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 59 పాయింట్లు పెరిగి 18,747 వద్ద ట్రేడవుతోంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 43,583 వద్ద మొదలైంది. 43,536 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,770 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 254 పాయింట్లు ఎగిసి 43,698 వద్ద నడుస్తోంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 31 కంపెనీలు లాభాల్లో 19 నష్టాల్లో ఉన్నాయి. హెచ్డీఎఫ్‌సీ లైఫ్, బజాజ్ ఫిన్‌సర్వ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హిందాల్కో, యూపీఎల్‌ షేర్లు లాభపడ్డాయి. బజాజ్‌ ఆటో, టాటా కన్జూమర్‌, విప్రో, టీసీఎస్‌, బీపీసీఎల్‌ షేర్లు నష్టపోయాయి. ఐటీ, రియాల్టీ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్‌, హెల్త్‌కేర్‌ సూచీలు పెరిగాయి. 

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.440 పెరిగి రూ.60,110గా ఉంది. కిలో వెండి రూ.73,100 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.390 పెరిగి రూ.26,000 వద్ద ఉంది. 

Also Read: ఎక్కువ వడ్డీ ఇచ్చే స్పెషల్‌ FDs, ఈ నెల వరకే ఈ గోల్డెన్‌ ఛాన్స్‌

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *