[ad_1]
Stock Market Today News in Telugu: నిన్న (మంగళవారం) రాణించిన భారత స్టాక్ మార్కెట్లు ఈ రోజు (బుధవారం) ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఎలాంటి కీలక సిగ్నల్స్ అందకపోవడంతో దేశీయ మార్కెట్లకు పట్టు దొరకలేదు. అందువల్లే పూర్తి ఫ్లాట్‌గా (Share Market Opening Today) ప్రారంభమయ్యాయి. అయితే, బుల్స్ బలం చూపడంతో మార్కెట్లు గ్రీన్ కలర్‌లోకి తిరిగి వచ్చాయి.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది…
నిన్న (మంగళవారం, 21 నవంబర్ 2023) 65,930 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 91 పాయింట్లు లేదా 0.14 శాతం స్వల్ప పతనంతో 65,839 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. గత సెషన్‌లో 19,783 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 0.60 పాయింట్ల మార్పుతో 19,784 వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.
సెన్సెక్స్ చిత్రం
మార్కెట్ ప్రారంభం తర్వాత, సెన్సెక్స్ 30 ప్యాక్‌లోని 23 స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి, మిగిలిన 7 స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ టాప్ గెయినర్స్‌లో… టాటా మోటార్స్ 0.72 శాతం, పవర్ గ్రిడ్ 0.67 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.54 శాతం, టైటన్ 0.50 శాతం, భారతి ఎయిర్‌టెల్ 0.46 శాతం చొప్పున బలపడ్డాయి. ఫార్మా మేజర్ కంపెనీ సన్ ఫార్మా షేర్లు 0.44 శాతం పెరిగాయి.
నిఫ్టీ షేర్ల పరిస్థితి
ఓపెనింగ్ ట్రేడ్‌లో, నిఫ్టీ 50 ప్యాక్‌లోని 34 స్టాక్స్ లాభపడగా, 16 స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్‌లో… BPCL 2.40 శాతం, టాటా కన్స్యూమర్స్ 1.17 శాతం, HDFC లైఫ్ 0.91 శాతం, టైటన్ 0.81 శాతం, సిప్లా 0.74 శాతం పెరిగాయి.
నిఫ్టీ సెక్టోరల్ ఇండెక్స్‌లు
నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్, PSU బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, రియాల్టీ రంగాల్లో తిరోగమనం కనిపించింది. మీడియా 0.73 శాతం, ఫార్మా రంగం 0.70 శాతం, హెల్త్‌కేర్ ఇండెక్స్ 0.55 శాతం, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 0.37 శాతం పెరిగాయి.
ఉదయం 10.15 గంటల సమయానికి, సెన్సెక్స్ 105.40 పాయింట్లు లేదా 0.16% పెరిగి 66,036 వద్ద; నిఫ్టీ 32.40 పాయింట్లు లేదా 0.16% పెరిగి 19,815.80 వద్ద ట్రేడవుతున్నాయి.
ఓవర్‌నైట్‌లో, టెక్నాలజీ షేర్లలో బలహీనత కారణంగా US మార్కెట్ ఐదు రోజుల విన్నింగ్ రన్‌ను ముగించింది. US FOMC మినిట్స్ ప్రకారం, భవిష్యత్‌లో వడ్డీ రేట్ల పెంపుపై ‘జాగ్రత్తతో కూడిన వైఖరి’ని అనుసరించేందుకు ఫెడ్ నిర్ణయించింది.
ఇండో-పసిఫిక్ మార్కెట్లలో… ఓపెనింగ్ టైమ్‌లో, నికాయ్ 0.4 శాతం పెరగగా, కోస్పి, తైవాన్ 0.5 తలో శాతం క్షీణించాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ఎస్‌బీఐ వికేర్ చివరి తేదీ పొడిగింపు – ఎక్కువ వడ్డీ ఆదాయం అందించే స్కీమ్ ఇది
[ad_2]
Source link
Leave a Reply