[ad_1]
ఎముకల సాంద్రతను మెరుగుపరుస్తుంది..
మహిళలు మెనోపాజ్ దశకు చేరుకున్న తర్వాత.. శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు క్షీణించడం ప్రారంభిస్తాయి. దీని కారణంగా ఎముక సాంద్రత తగ్గుతుంది. వెయిట్ లిఫ్టింగ్ ఎముకల సాంద్రతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది, ఆస్టియోపోరొసిస్ ముప్పును తగ్గిస్తుంది. వెయిట్ లిఫ్టింగ్ ఎముక లోడ్-బేరింగ్ సామర్థ్యాన్ని పెంచుతుంది, ఎముక పెరుగుదల, సాంద్రతను ప్రోత్సహిస్తుంది.
(image source- pexels)
జీవక్రియను మెరుగుపరుస్తుంది..
మహిళలో వయస్సు పెరిగే కొద్దీ జీవక్రియ తగ్గుతూ ఉంటుంది. దీని కారణంగా బరువు పెరగడం, తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. . వెయిట్ లిఫ్టింగ్ కండర ద్రవ్యరాశిని పెంచుతుంది, శరీర జీవక్రియ రేటును పెంచుతుంది. బరువులు ఎత్తితే.. ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి. బరువు నియంత్రణలో ఉంటుంది.
Brain Boosting Foods : మీ బుర్రకు పదును పెట్టే.. ఆహారాలు ఇవే..!
మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది
మెనోపాజ్ దశలో హార్మోన్ల మార్పుల కారణంగా.. మానసిక కల్లోలం, నిరాశ, ఆందోళన వంటి మానసిక సమస్యలు ఎదురవుతాయి. వ్యాయామం మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. వెయిట్ లిఫ్టింగ్ చేస్తే.. ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది.. ఇవి హ్యాపీ హార్మోన్స్. ఎండార్ఫిన్‌లు ఒత్తిడిని తగ్గించి.. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
(image source- pexels)
వేడి ఆవిర్లను తగ్గిస్తుంది..
మెనోపాజ్ దశలో వేడి ఆవిర్లు.. సాధారణంగా ఎదురయ్యే సమస్య. వెయిట్ లిఫ్టింగ్ హాట్ ఫ్లాషెస్ ఫ్రీక్వెన్సీ, తీవ్రతను తగ్గిస్తుందని అధ్యయనాలు పేర్కొన్నాయి.
(image source- pexels)
నిద్రను మెరుగుపరుస్తుంది..
మెనోపాజ్ దశలో మహిళలు ఎదుర్కొనే సమస్యల్లో నిద్రలేమి ఒకటి. వెయిట్ లిఫ్టింగ్ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది, శరీరానికి విశ్రాంతిని అందిస్తుంది. నిద్రలేమి కారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యల ముప్పును కూడా తగ్గిస్తుంది. (image source- pexels)
గుండెకు మంచిది..
మహిళలను మెనోపాజ్‌కు ముందు ఈస్ట్రోజన్ హార్మోన్ గుండెపోటు నుంచి రక్షిస్తుంది. అయతే, మెనోపాజ్ దశలో ఈస్ట్రోజన్ క్షీణించడం మొదలవుతుంది. దీని కారణంగా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. మహిళలు ఈ దశలో గుండె ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ఫీజికల్‌గా యాక్టివ్‌గా ఉండటం మేలు. వెయిట్ లిఫ్టింగ్ రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ రెండూ గుండె సమస్యలతో ముడిపడి ఉంటాయి. (image source- pexels)
Mental Health: ఈ అలవాట్లు మిమ్మల్ని మెంటల్‌గా వీక్ చేస్తాయ్..!
బలం, శక్తిని పెంచుతుంది..
మెనోపాజ్ దశలో కండరాల నష్టం ఎక్కువగా ఉంటుంది. శక్తి, సత్తువ తగ్గడానికి దారితీస్తుంది. వెయిట్ లిఫ్టింగ్ కండర ద్రవ్యరాశిని మెరుగుపరుస్తుంది, కండరాల నష్టాన్ని నివారిస్తుంది. ఇది బలం, శక్తి స్థాయిలను పెంచుతుంది.
(image source- pexels)
Kidney Stones: కిడ్నీలో రాళ్లు రాకుండా.. ఈ జాగ్రత్తలు పాటించండి..!
కీళ్ల నొప్పులు తగ్గిస్తుంది..
రుతువిరతి సమయంలో మహిళలకు కీళ్ల నొప్పులు సాధారణ సమస్య, అయితే వెయిట్‌లిఫ్టింగ్ కీళ్ల చుట్టూ ఉన్న కండరాలను బలోపేతం చేస్తుంది, సరైన కీళ్ల అమరికను ప్రోత్సహించి.. నొప్పి, మంటను తగ్గిస్తుంది. (image source- pixabay)
మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది..
మెనోపాజ్ దశలో మెదుడు పనితీరు తగ్గే అవకాసం ఉంది. అయితే వెయిట్ లిఫ్టింగ్ అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుంది, వయస్సు-సంబంధిత జ్ఞాపకశక్తి నష్టాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. వెయిట్ లిఫ్టింగ్ మెదడుకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది, కొత్త న్యూరల్ కనెక్షన్ల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, అభిజ్ఞా క్షీణత ప్రమాదాన్ని తగ్గిస్తుంది. (image source- pixabay)
Cow Milk Health Benefits: ఆవు పాలు తాగితే.. బరువు తగ్గుతారా..?
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply