[ad_1]
Regular Income Schemes: ప్రస్తుత కాలంలో అనేక పెట్టుబడి మార్గాలు అందుబాటులో ఉన్నాయి. పెట్టుబడిదార్లలో కొంతమందిది పరుగెత్తి పాలు తాగై నైజం. అంటే, ఎక్కువ రిస్క్ తీసుకుని, షార్ట్ టర్మ్‌లో డబ్బు సంపాదించాలనుకుంటారు. మరికొంతమంది నిలబడి నీళ్లు తాగే టైపు. తక్కువ రిస్క్‌తో దీర్ఘకాలిక పెట్టుబడిని ఇలాంటి వాళ్లు ఇష్టపడతారు. రెండో కోవకు చెందిన వ్యక్తుల కోసం కొన్ని పెట్టుబడి మార్గాలు ఉన్నాయి. వాటిలో డబ్బు పెట్టడం ద్వారా క్రమం తప్పని ఆదాయం పొందవచ్చు.
స్టాక్స్, బాండ్లు, మ్యూచువల్ ఫండ్‌లు, రియల్ ఎస్టేట్, రిటైర్‌మెంట్ పథకాలు దీర్ఘకాలానికి ప్రాచుర్యం పొందాయి. ఇది కాకుండా, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఈక్విటీ ఫండ్స్‌లో కూడా దీర్ఘకాలం కోసం పెట్టుబడి పెట్టవచ్చు.
పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS) మీకు రెగ్యులర్ ఆదాయాన్ని అందించే ఒక పెట్టుబడి పథకం. ఇది కేంద్ర ప్రభుత్వ చిన్న మొత్తాల పొదుపు పథకం (స్మాల్ సేవింగ్స్ స్కీమ్) కింద నడుస్తుంది. ఇందులో ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో 7.4 శాతం వడ్డీ రేటు లభిస్తుంది, రూ. 9 లక్షలు పెట్టుబడిగా పెట్టవచ్చు. జాయింట్ ఖాతా ఓపెన్ చేస్తే రూ. 15 లక్షల వరకు జమ చేయవచ్చు. కనిష్టంగా రూ. 1000 నుంచి పెట్టుబడి ప్రారంభించవచ్చు.
ప్రభుత్వ దీర్ఘకాలిక బాండ్లు లేదా గోల్డ్ బాండ్లు
నిధులను సేకరించేందుకు ప్రభుత్వం ఇటువంటి బాండ్లను జారీ చేస్తుంది. దీని కింద కొంత కాలం పాటు పెట్టుబడి పెట్టవచ్చు. ఆ పెట్టుబడిపై వడ్డీని కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. హామీతో కూడిన రాబడిని ఇది ఇస్తుంది. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే ఇది మంచి ఎంపిక. ఫిక్స్‌డ్ రేట్ బాండ్‌లు, సావరిన్ గోల్డ్ బాండ్‌లు (SGB), ఇన్‌ఫ్లేషన్-ఇండెక్స్డ్ బాండ్‌లు, PSU బాండ్‌లు, జీరో-కూపన్ బాండ్‌లు మొదలైన వాటిలో మీ డబ్బును జమ చేయవచ్చు.
మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్ మ్యూచువల్ ఫండ్
నెలవారీ ఆదాయ ప్రణాళిక (MIP) అనేది ఒక రకమైన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి. డెట్ & ఈక్విటీ సెక్యూరిటీల నుంచి ఆదాయాన్ని పొందడం, మూలధనాన్ని సంరక్షించడం లక్ష్యంతో ఈ పెట్టుబడి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా రెగ్యులర్ ఆదాయాన్ని సంపాదించడానికి సిస్టమాటిక్ విత్‌డ్రాల్ ప్లాన్‌ను (Systematic withdrawal plan -SWP) ఉపయోగించడం ఉత్తమ మార్గం.
రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి
మీ పెట్టుబడిపై మంచి ఆదాయం సంపాదించడానికి రియల్ ఎస్టేట్‌లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. మీ పెట్టుబడిని దీర్ఘకాలం పాటు కొనసాగిస్తే, మీకు ఆకర్షణీయమైన మొత్తం తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది.
ఇవే కాకుండా… కేంద్ర ప్రభుత్వం అందించే PPF, రిటైర్మెంట్ ఫండ్ EPF, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ వంటి పథకాలలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు.
[ad_2]
Source link
Leave a Reply