PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

రూ.65 వేలలోపే హోండా కొత్త బైక్ – ఫీచర్లు ఎలా ఉన్నాయో చూశారా?

[ad_1]

New Honda Shine Bike: దేశీయ మార్కెట్లో 100 సీసీ సెగ్మెంట్ బైక్‌లు అత్యధికంగా అమ్ముడు అవుతున్నాయి. హీరో స్ప్లెండర్, బజాజ్ ప్లాటినా ఈ సెగ్మెంట్‌లో ముందంజలో ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌లో అత్యధికంగా ప్రజలు ఇష్టపడే బైక్‌లు ఇవే. కాబట్టి ఈ విభాగంలో హోండా షైన్, స్ప్లెండర్, బజాజ్ ప్లాటినాకు గట్టి పోటీనిస్తుంది. ఇప్పుడు హోండా షైన్‌లో కొత్త వేరియంట్ లాంచ్ అయింది.

కొత్త హోండా షైన్ లుక్
హోండా తన కొత్త బైక్‌లో 768 ఎంఎం సీటు, సైడ్ స్టాండ్‌తో ఇన్హిబిటర్, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్‌తో కూడిన ఈక్వలైజర్, పీజీఎమ్-ఎఫ్‌ఐ టెక్నాలజీతో 168 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ వంటి ఫీచర్లను అందించనుంది.

కొత్త హోండా షైన్ ఇంజన్
కొత్త హోండా షైన్ 100 సీసీ ఇంజన్‌తో లాంచ్ అయింది. అదే సమయంలో ఫ్యూయల్ ట్యాంక్ బయట ఫ్యూయల్ పంపు అందించారు. ఇది బైక్ ధరను తగ్గించడాన్ని మరింత సులభతరం చేసింది.

కొత్త హోండా షైన్ కలర్ ఆప్షన్స్
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ హోండా బైక్ రెడ్ స్ట్రిప్, బ్లాక్ విత్ బ్లూ స్ట్రిప్, బ్లాక్ విత్ గ్రీన్ స్ట్రిప్, బ్లాక్ విత్ గోల్డ్ స్ట్రైప్, బ్లాక్ విత్ గ్రే స్టైప్ పెయింట్ స్కీమ్ ఆప్షన్‌లతో మార్కెట్లలో లాంచ్ అయింది.

కొత్త హోండా షైన్ ధర
కంపెనీ హోండా షైన్ 100 సీసీ బైక్‌ను రూ.64,900 ఎక్స్-షోరూమ్ ధరతో పరిచయం చేసింది. ఇది లాంచ్ ప్రైస్ కాబట్టి దీనిలో కంపెనీ ఎప్పుడైనా మార్పులు చేయవచ్చు. ఈ బైక్ ఉత్పత్తి వచ్చే నెల నుండి ప్రారంభమవుతుంది. డెలివరీలు 2023 మే నెల నుంచి ప్రారంభం కానున్నాయి.

కొత్త హోండా షైన్ వారంటీ
కంపెనీ తన హోండా షైన్ 100 సీసీ బైక్‌పై ఆరు సంవత్సరాల వారంటీని అందిస్తోంది. ఇందులో మూడు సంవత్సరాల స్టాండర్డ్,  మూడు సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వారంటీ ఉంటుంది.

ఏ బైక్‌లతో పోటీ?
దేశీయ మార్కెట్లో 100 సీసీ హోండా షైన్ ఈ విభాగంలో హీరో స్ప్లెండర్, బజాజ్ ప్లాటినా వంటి వాటితో పోటీపడుతుంది.

హోండా సీబీ500ఎక్స్ స్పోర్ట్స్ బైక్ మనదేశంలో 2021లో లాంచ్ అయింది. అయితే ఈ బైక్ సేల్స్ కంపెనీ ఆశించనంతగా లేవు. అయితే అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో ఇప్పుడు ఈ బైక్ ధరను కంపెనీ భారీగా తగ్గించింది. రూ.6,87,386 నుంచి రూ.5,79,952కు ఈ బైక్ ధర తగ్గింది. సరిగ్గా చెప్పాలంటే రూ.1,07,434 తగ్గింపును ఈ మిడిల్‌వెయిట్ అడ్వెంచర్ బైక్‌పై అందించారు. దీంతో ఇప్పటికైనా ఈ బైక్ సేల్స్ పెరుగుతాయని కంపెనీ ఆశిస్తుంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న అడ్వెంచర్ బైకులు కవాసకీ వెర్సిస్ 650, సుజుకీ వీ-స్టార్మ్ 650 ఎక్స్‌టీల కంటే దీని ధర తక్కువగా ఉంది. కవాసకీ వెర్సిస్ ధర రూ.7.15 లక్షలు కాగా… సుజుకీ వీ-స్టార్మ్ ధర రూ.8.84 లక్షలుగా ఉంది. ఇవన్నీ ఎక్స్-షోరూం ధరలే.

హోండా సీబీ500ఎక్స్ చూడటానికి ఆఫ్ రోడ్ బైక్‌లా ఉంటుంది కానీ.. ఇది మంచి అడ్వెంచర్ బైక్. దీని సీట్ హైట్ 830 మిల్లీమీటర్లు కాగా.. వెనకవైపు ఫుట్ పెగ్స్ కూడా ఉన్నాయి. హ్యాండిల్ బార్ కొంచెం పొడుగ్గా ఉంటుంది కానీ… బ్యాలెన్స్ చేయడానికి ఇది సరిగ్గా సరిపోతుంది.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *