లైఫ్‌ టైమ్‌ హై లెవల్స్‌కు దగ్గర్లో సెన్సెక్స్‌, నిఫ్టీ – రూ.2.5 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్

[ad_1]

Stock Market Closing 27 June 2023:

స్టాక్‌ మార్కెట్లకు మరోసారి ఊపొచ్చింది. మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. గ్లోబల్‌ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఫియర్‌ ఇండెక్స్‌ విక్స్‌ 5 శాతం మేర తగ్గింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 126 పాయింట్లు పెరిగి 18,817 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 446 పాయింట్లు పెరిగి 63,416 వద్ద ముగిశాయి. ఇన్వెస్టర్ల సంపద నేడు ఒక్కరోజే రూ.2.5 లక్షల కోట్ల మేర పెరిగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.03 వద్ద స్థిరపడింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 62,970 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 63,151 వద్ద మొదలైంది. 63,054 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 63,467 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 446 పాయింట్ల లాభంతో 63,416 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

సోమవారం 18,691 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 18,748 వద్ద ఓపెనైంది. 18,714 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,829 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 126 పాయింట్ల లాభంతో 18,817 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 43,804 వద్ద మొదలైంది. 43,693 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,194 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 480 పాయింట్లు పెరిగి 44,121 వద్ద స్థిరపడింది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 34 కంపెనీలు లాభాల్లో 16 నష్టాల్లో ఉన్నాయి. అపోలో హాస్పిటల్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎస్బీఐ, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, ఎస్బీఐ లైఫ్‌ షేర్లు లాభపడ్డాయి. సిప్లా, బ్రిటానియా, టాటా కన్జూమర్‌, అదానీ పోర్ట్స్‌, యూపీఎల్‌ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు స్వల్పంగా ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్‌, ప్రైవేటు బ్యాంక్‌, రియాల్టీ సూచీలు ఎక్కువ పెరిగాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.59,180గా ఉంది. కిలో వెండి రూ.600 పెరిగి రూ.71,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.70 పెరిగి రూ.24,530 వద్ద ఉంది. 

Also Read: ఆర్‌బీఐ ఈ-రూపీ యాప్‌ వచ్చేసిందోచ్‌ – ఎలా డౌన్‌లోడ్‌ చేయాలి, పేమెంట్‌ ప్రాసెస్‌ ఏంటీ?

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *