PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

వరుస నష్టాలకు తెర! రీబౌండ్‌ అయిన నిఫ్టీ, సెన్సెక్స్‌

[ad_1]

Stock Market at 12PM, 22 September 2023:

భారత స్టాక్‌ మార్కెట్లు వరుస నష్టాల నుంచి తేరుకున్నాయి. మెజారిటీ ఆసియా సూచీలు లాభాల్లో ఉండటం ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంటుకు దారితీసింది. లాభాల స్వీకరణ తగ్గిపోవడంతో మార్కెట్లు రీబౌండ్‌ అయ్యాయి. నేటి మధ్యాహ్నం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 38 పాయింట్లు పెరిగి 19,781 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 159 పాయింట్లు ఎగిసి 66,389 వద్ద కొనసాగుతున్నాయి. ఫార్మా, ఐటీ, లోహ రంగాలపై సెల్లింగ్‌ ప్రెజర్‌ నెలకొంది. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగాలకు మద్దతు దొరికింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 66,230 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 66,215 వద్ద మొదలైంది. 66,016 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,417 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 159 పాయింట్లు పెరిగి 66,389 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

గురువారం 19,742 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 19,744 వద్ద ఓపెనైంది. 19,744 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,792 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 38 పాయింట్లు ఎగిసి 19,781 వద్ద ట్రేడవుతోంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 44,707 వద్ద మొదలైంది. 44,548 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,996 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 356 పాయింట్ల లాభంతో 44,980 వద్ద కొనసాగుతోంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 26 కంపెనీలు లాభాల్లో 24 నష్టాల్లో ఉన్నాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఎస్బీఐ, మారుతీ, టెక్‌ మహీంద్రా, ఎం అండ్‌ ఎం షేర్లు లాభపడ్డాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, విప్రో, పవర్‌ గ్రిడ్‌, సిప్లా, సన్‌ ఫార్మా షేర్లు నష్టపోయాయి. ఫార్మా, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ రంగలు ఎక్కువ ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్‌, ప్రైవేటు బ్యాంకు రంగాల షేర్లు పుంజుకున్నాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.210 తగ్గి రూ.59,840 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.1000 పెరిగి రూ.75,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.10 పెరిగి రూ.24,640 వద్ద ఉంది.

క్రితం సెషన్లో ఏం జరిగిందంటే?

క్రితం సెషన్లో 66,800 వద్ద ముగిసిన సెన్సెక్స్‌ నేడు 66,608 వద్ద మొదలైంది. ఆరంభం నుంచే నష్టాల్లోకి జారుకుంది. 66,128 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని అందుకుంది. చివరికి 570 పాయింట్ల నష్టంతో 66,230 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌కు ఆరంభ స్థాయే గరిష్ఠం కావడం గమనార్హం. గురువారం 19,840 వద్ద మొదలైన నిఫ్టీ 19,848 వద్ద గరిష్ఠాన్ని తాకింది. 19,709 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ మొత్తంగా 159 పాయింట్లు పతనమై 19,742 వద్ద క్లోజైంది. బ్యాంకు నిఫ్టీ ఏకంగా 760 పాయింట్లు నష్టపోయి 44,623 వద్ద ముగిసింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి ఫ్లాట్‌గా 83.09 వద్ద స్థిరపడింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *