[ad_1]
బీట్‌రూట్..
యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (USDA) ప్రకారం, 100 గ్రాముల బీట్‌రూట్‌లో కేవలం 43 కేలరీలు, 0.2 గ్రాముల కొవ్వు, 10 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. శీతాకాలంలో మీ డైట్‌లో ఎక్కువగా బీట్ రూట్ చేర్చుకుంటే.. బరువు తగ్గడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఈ దుంపలో పుష్కలంగా ఉండే నైట్రేట్స్ ఎక్కువ సమయం పాటు శక్తినిస్తాయి. కాబట్టి రోజూ ఓ గ్లాసు జ్యూస్ తాగాలి. దీంట్లో ఇనుమూ పెద్ద మొత్తంలోనే ఉంటుంది. ఇది రక్తహీనత రాకుండా చూస్తుంది. క్యాల్షియం, ఖనిజాలు మెండుగా ఉండే దుంప ఇది. ఎముకలు ఆరోగ్యంగా, దృఢంగా ఉండటానికి ఇవి తోడ్పడతాయి.
క్యారెట్..
శీతాకాలంలో క్యారెట్ ఎక్కువగా దొరుకుతుంది. క్యారెట్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి క్యారెట్ బెస్ట్ ఆప్షన్. కాలేయంలో కొవ్వులు పేరుకుపోకుండా క్యారెట్ ఉపయోగపడుతుంది. క్యారెట్‌లోని యాంటీఆక్సిడెంట్స్, విటమిన్-A శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపిస్తాయి. క్యారెట్‌లోని ఫ్లావనాయిడ్ కాంపౌండ్స్ చర్మాన్ని, ఊపిరితిత్తులకు రక్షణ కల్పిస్తాయి.
ఆకుకూరలు..
శీతాకాలం బరువు తగ్గాలనుకున్నా, బరువు పెరగకుండా ఉండాలన్నా… మీ ఆహారంలో ఫైబర్ సమృద్ధిగా తీసుకోవాలి. ఈ కాలంలో ఆకుకూరలు ఎక్కువాగా తీసుకుంటే మంచిది, వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. పాలకూర, ఆవకూర, మెంతి కూరలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.
ముల్లంగి..
ముల్లంగిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. పైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, పొట్ట కొవ్వు కరుగుతుంది. ముల్లంగి కడుపుని శుభ్రపరుస్తుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది.
జామకాయ..
జామపండులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. రోజువారీకి అవసరమైన ఫైబర్‌లో 12% జామకాయ నుంచిలభిస్తుంది. చలికాలంలో జామకాయ తింటే.. త్వరగా బరువు తగ్గుతారు. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి.. ఇవి జీర్ణక్రియ, జీవక్రియను మెరుగుపరుస్తాయి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply