సాయంత్రానికి రైజైన స్టాక్‌ మార్కెట్లు – సెన్సెక్స్‌ 224 ప్లస్‌, నిఫ్టీ 5 డౌన్‌

[ad_1]

Stock Market Closing 02 February 2023: 

స్టాక్‌ మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా మొదలయ్యాయి. ఐరోపా మార్కెట్లు మొదలయ్యాక లాభాల బాట పట్టాయి. నిఫ్టీ 50 సూచీపై అదానీ కంపెనీల షేర్లు ప్రతికూల ప్రభావం చూపించాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 5 పాయింట్ల నష్టంతో 17,610 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 224 పాయింట్ల లాభంతో 59,932 వద్ద ముగిశాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లకు డిమాండ్‌ కనిపించింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 25 పైసలు బలహీనపడి 82.18 వద్ద స్థిరపడింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 59,708 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 59,459 వద్ద మొదలైంది. 59,215 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,007 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 224 పాయింట్ల లాభంతో 59,932 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

బుధవారం 17,616 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,517 వద్ద ఓపెనైంది. 17,445 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,653 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 5 పాయింట్ల నష్టంతో 17,610 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ మోస్తరు లాభాల్లో ముగిసింది. ఉదయం 39,943 వద్ద మొదలైంది. 39,761 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,757 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 156 పాయింట్లు పెరిగి 40,669 వద్ద స్థిరపడింది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 20 కంపెనీలు లాభాల్లో 30 నష్టాల్లో ముగిశాయి. ఐటీసీ, బ్రిటానియా, ఇన్ఫీ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌ షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, యూపీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, అదానీ పోర్ట్స్‌, ఐచర్‌ మోటార్స్‌ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా, రియాల్టీ సూచీలు ఎగిశాయి. ఫైనాన్స్‌, మెటల్‌, ఫార్మా, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎరుపెక్కాయి.

Also Read: మెరుపులు మిస్సింగ్, అంచనాలు అందుకోని టైటన్‌

Also Read: సిద్ధంగా ఉన్నారా?, రెండు కంపెనీలు పబ్లిక్‌ ఆఫర్స్‌ ప్రకటించబోతున్నాయ్!

Also Read: బడ్జెట్‌ బూస్ట్‌ దొరికిన 30 స్టాక్స్‌, మార్కెట్‌ కళ్లన్నీ ఇప్పుడు వీటి మీదే!

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *