హోమ్‌ లోన్‌ తీసుకునేవాళ్లకు బంపరాఫర్‌, భారీ డిస్కౌంట్‌ ఇస్తున్న గవర్నమెంట్‌ బ్యాంక్‌

[ad_1]

SBI Home Loan: హోమ్‌ లోన్‌ తీసుకోవాలనుంటున్నారా?, దేశంలో అతి పెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంక్‌ అయిన ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తమ బ్యాంక్‌ నుంచి హోమ్‌ లోన్‌ (SBI Home loan) తీసుకోవాలనుకునే వారికి బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. 

హోమ్‌ లోన్‌ ప్రాసెసింగ్‌ ఫీజ్‌ (processing fee) మీద 50 శాతం నుంచి 100 శాతం వరకు డిస్కౌంట్‌ ఇస్తామని స్టేట్ బ్యాంక్ తెలిపింది. అంటే ప్రాసెసింగ్‌ ఫీజ్‌ కనీసం సగం తగ్గుతుంది లేదా పూర్తిగా ఉండదు. హౌసింగ్‌ లోన్‌ తీసుకునే వాళ్లకు వేల రూపాయలు మిగులుతాయి. ఈ ఆఫర్‌ ఈ ఏడాది ఆగస్టు 31 వరకే అందుబాటులో ఉంటుంది. సాధారణ గృహ రుణం, ఫ్లెక్సీపే, ఎన్నారై, నాన్‌-శాలరీజ్‌, ప్రివిలేజ్‌, అపోన్ ఘర్‌పై ఎస్‌బీఐ ప్రాసెసింగ్‌ ఫీజ్‌ రాయితీ వర్తిస్తుంది.

కొత్త లోన్లు, టాప్‌-అప్స్‌కు 50% డిస్కౌంట్‌
SBI హోమ్ లోన్ వెబ్‌సైట్ ప్రకారం… కొత్తగా హౌసింగ్‌ లోన్‌ తీసుకునే వాళ్లతో పాటు, హోమ్ లోన్‌ టాప్-అప్ (గతంలో తీసుకున్న గృహ రుణానికి అదనంగా మరికొంత లోన్‌ తీసుకోవడం) చేసుకునే వాళ్లకు కూడా 50% డిస్కౌంట్‌ ఆఫర్‌ వర్తిస్తుంది. ప్రస్తుతం, హౌసింగ్‌ లోన్‌లో 0.35 శాతం మొత్తాన్ని ప్రాసెసింగ్‌ ఫీజు రూపంలో ఎస్‌బీఐ వసూలు చేస్తోంది. దీని ప్రకారం కనీస మొత్తం రూ. 2000 నుంచి గరిష్ఠంగా రూ. 10,000 వరకు తీసుకుంటోంది. దీనికి GST కూడా యాడ్‌ అవుతుంది. సాధారణ హోమ్‌ లోన్‌, లోన్‌ టాప్-అప్‌కు 50 శాతం డిస్కౌంట్‌ చొప్పున ప్రాసెసింగ్‌ ఫీజ్‌ కనిష్టంగా రూ. 2,000 + GST, గరిష్టంగా రూ. 5,000 + GST పడుతుంది. 

ప్రాసెసింగ్‌ ఫీజ్‌లో వీళ్లకు 100% డిస్కౌంట్‌
టేకోవర్‌, రీసేల్‌, రెడీ టు మూవ్‌ ప్రాపర్టీల కోసం లోన్‌ తీసుకున్న వాళ్లకు 100 శాతం వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. 

వీళ్లకు నో డిస్కౌంట్‌
ఇన్‌స్టా హోమ్‌ టాప్‌, రివర్స్‌ మార్టిగేజ్‌, EMDకి ‍‌(Earnest Money Deposit) ఈ స్కీమ్‌ వర్తించదు.

సిబిల్‌ స్కోర్‌ బాగుంటే వడ్డీలో రాయితీ

CIBIL స్కోర్‌ 750 – 750+
750, లేదా అంతకంటే ఎక్కువ సిబిల్‌ (CIBIL) స్కోర్‌ మీకు ఉంటే, ఈ ఆఫర్ కాలంలో 8.70% వడ్డీకే హోమ్‌ లోన్‌ పొందొచ్చు. 45 bps (0.45 శాతం) డిస్కౌంట్‌ లభిస్తుంది. ఆఫర్‌ పిరియడ్‌ పూర్తయితే, వీళ్లకు వర్తించే వడ్డీ రేటు 9.15%.

CIBIL స్కోర్‌ 700 -749
700 -749 మధ్య ఉన్న CIBIL స్కోర్‌ ఉన్న గృహ రుణగ్రహీతలు 55 bps (0.55 శాతం) రాయితీ పొందుతారు. ఈ డిస్కౌంట్‌ లేకపోతే ఎఫెక్టివ్‌ రేట్‌ 9.35%. కాబట్టి, ఎస్‌బీఐ ఆఫర్ చేస్తున్న వడ్డీ రేటు 8.80%. 

CIBIL స్కోర్‌ 650 – 699
650 – 699 మధ్య CIBIL స్కోర్ ఉండి, హౌస్‌ లోన్‌ కోసం వచ్చే వాళ్లకు డిస్కౌంట్‌ వర్తించదు, 9.45% ఇంట్రెస్ట్‌ రేట్‌ పడుతుంది. 550 – 649 మధ్య CIBIL స్కోర్‌ ఉన్నవాళ్ల నుంచి 9.65% వడ్డీ రేటును బ్యాంక్‌ ఛార్జ్‌ చేస్తుంది.

సిబిల్‌ స్కోర్‌ ఆధారంగా ఇచ్చే డిస్కౌంట్‌ లిమిటెడ్‌ పిరియడ్‌ ఆఫర్‌, 31.08.2023 వరకే వర్తిస్తాయి.

SBI MCLR
SBI వెబ్‌సైట్ ప్రకారం, ఈ నెల 15వ తేదీ నుంచి మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) 5 బేసిస్ పాయింట్లు పెరిగింది. MCLR ఆధారిత రేట్లు ఇప్పుడు 8% నుంచి 8.75% మధ్య ఉన్నాయి. ఓవర్‌నైట్ MCLR రేటు 7.95% నుంచి 8%కు, 5 bps పెరిగింది. ఒక నెల, మూడు నెలల కాల వ్యవధి రుణాలు 8.10% నుంచి 8.15% చేరాయి. ఆరు నెలల MCLR 5 bps పెరిగి ద్వారా 8.45% వద్ద ఉంది.

మరో ఆసక్తికర కథనం: హిస్టారికల్‌ మూమెంట్‌ చూద్దామనుకుంటే హిస్టీరియా తెప్పించింది, స్టాక్‌ మార్కెట్‌తో ఇట్లుంటది

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *