[ad_1]
Stock Market Closing 26 July 2023:
స్టాక్ మార్కెట్లు బుధవారం లాభపడ్డాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. పాజిటివ్ సెంటిమెంటు వల్ల ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 97 పాయింట్లు పెరిగి 19,778 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 351 పాయింట్లు ఎగిసి 66,707 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 13 పైసలు బలహీనపడి 82 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 66,355 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 66,434 వద్ద మొదలైంది. 66,431 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,897 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 351 పాయింట్ల లాభంతో 66,707 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
మంగళవారం 19,680 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 19,733 వద్ద ఓపెనైంది. 19,716 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,825 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 97 పాయింట్లు పెరిగి 19,778 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 45,935 వద్ద మొదలైంది. 45,804 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 46,096 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 217 పాయింట్లు పెరిగి 46,062 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 31 కంపెనీలు లాభాల్లో 18 నష్టాల్లో ఉన్నాయి. ఎల్‌టీ, సిప్లా, ఐటీసీ, బ్రిటానియా, సన్ ఫార్మా షేర్లు లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎం అండ్ ఎం, అపోలో హాస్పిటల్స్, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. ఆటో, కన్జూమర్ డ్యురబుల్స్ మినహా అన్ని రంగాల సూచీలు పెరిగాయి. బ్యాంకు, ఎఫ్ఎంసీజీ, మీడియా, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకు, రియాల్టీ, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు బాగా లాభపడ్డాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.160 పెరిగి రూ.60,160 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.400 పెరిగి రూ.77,400 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.190 పెరిగి రూ.25,460 వద్ద కొనసాగుతోంది.
Also Read: రిటర్న్ ఫైల్ చేసినా రూపాయి కూడా టాక్స్ కట్టలేదు, 70% మంది వాళ్లే!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Congratulations Service Care Limited on getting listed on NSE Emerge today!
The Company provides Workspace and Workforce Administration Services across all business domains. The public issue was of Rs. 2,067.62 lakhs at an issue price of Rs. 67 per share.#NSE #SME #listing… pic.twitter.com/OKTgYfiln6
— NSE India (@NSEIndia) July 26, 2023
Be part of a joint Investor Awareness Program by SEBI, NSE and NSDL on 27th July’23 at 10AM at exclusively for investors in Karnal, Haryana. Hurry up! Limited seats available.#InvestorAwareness #SEBI #NSE #StockMarket #ShareMarket #Investing #SecuritiesMarket @ashishchauhan pic.twitter.com/B83eM1muBl
— NSE India (@NSEIndia) July 26, 2023
On this day, let us take a moment to salute the sacrifices and the commitment of our armed forces. Jai Hind! #KargilVijayDiwas #KargilVictoryDay #IndianArmy #JaiHind @ashishchauhan pic.twitter.com/oaKqzUrMBB
— NSE India (@NSEIndia) July 26, 2023
[ad_2]
Source link
Leave a Reply