19,800 దగ్గర్లో నిఫ్టీ! 67,000 దాటేసిన సెన్సెక్స్‌

[ad_1]

Stock Market Opening 19 July 2023:

స్టాక్‌ మార్కెట్లో తీన్మార్‌ కొనసాగుతోంది. బుధవారం సూచీలు సరికొత్త గరిష్ఠాలకు చేరుకున్నాయి. గ్లోబల్‌ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 29 పాయింట్లు పెరిగి 19,778 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 162 పాయింట్లు పెరిగి 66,957 వద్ద కొనసాగుతున్నాయి. 

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 66,795 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 66,905 వద్ద మొదలైంది. 66,903 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 67,117 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 162 పాయింట్ల లాభంతో 66,957 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

మంగళవారం 19,749 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 19,802 వద్ద ఓపెనైంది. 19,776 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,841 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 29 పాయింట్లు పెరిగి 19,778 వద్ద ట్రేడవుతోంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 45,561 వద్ద మొదలైంది. 45,505 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,650 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 150 పాయింట్లు పెరిగి 45,561 వద్ద కొనసాగుతోంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 29 కంపెనీలు లాభాల్లో 21 నష్టాల్లో ఉన్నాయి. ఎన్టీపీసీ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, పవర్‌ గ్రిడ్‌, బీపీసీఎల్‌ షేర్లు లాభపడ్డాయి. హిందాల్కో, హీరోమోటో, ఎల్‌టీఐఎం, హిందుస్థాన్‌ యునీలివర్‌, ఏసియన్‌ పెయింట్స్ నష్టపోయాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ సూచీలు తగ్గాయి. బ్యాంకు, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎగిశాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.550 పెరిగి రూ.60,650 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.400 పెరిగి రూ.78,400 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.25,920 వద్ద ఉంది.

Also Read: ఆషాఢంలో వెండి రికార్డు! ఇక శ్రావణంలో కిలో రూ.85,000 చేరడం పక్కా!

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *