Hyundai Exter: 2023 జూలైలో లాంచ్ అయిన నాటి నుంచి, హ్యుందాయ్ ఎక్స్‌టర్ నిరంతరం గొప్ప విజయవంతమైన రికార్డులను నెలకొల్పుతూనే ఉంది. ఈ మైక్రో ఎస్‌యూవీ ఐదు ట్రిమ్‌లలో లభిస్తుంది. EX, S, SX, SX (O), SX (O) Connect… మోడల్స్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. వీటి ధర రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంది. మార్కెట్లో దీనికి అతిపెద్ద పోటీ టాటా పంచ్. ఎక్స్‌టర్ ధర ఇటీవల రూ. 16,000 పెరిగింది. ప్రస్తుతం వేరియంట్, నగరాన్ని బట్టి హ్యుందాయ్ ఎక్స్‌టర్ వెయిటింగ్ పీరియడ్ 18 నెలల వరకు ఉంది.

75 వేలకు పైగా బుకింగ్‌లు
మార్కెట్లోకి వచ్చిన మూడు నెలల్లోనే హ్యుందాయ్ ఎక్స్‌టర్ 75 వేల బుకింగ్‌లను పొందింది. ఇప్పటివరకు 23,000 యూనిట్లు వినియోగదారులకు పంపిణీ చేశారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో హ్యుందాయ్ మైక్రో ఎస్‌యూవీ… 7,000 యూనిట్లు, 7,430 యూనిట్లు, 8,647 యూనిట్లను విక్రయించింది.

ఏ వేరియంట్ ధర ఎంత?
హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఐదు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. ఈఎక్స్, ఎస్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ (వో), ఎస్ఎక్స్ (వో) కనెక్ట్ వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. వీటిలో మాన్యువల్ వేరియంట్ ధర రూ. 6 లక్షల నుంచి రూ. 9.32 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఏఎంటీ మోడల్‌ను రూ. 7.97 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్యలో కొనుగోలు చేయవచ్చు. ఇందులో ఎస్, ఎస్ఎక్స్(వో) అనే రెండు సీఎన్‌జీ వేరియంట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో మొదటి కారు ధర రూ.8.24 లక్షలు కాగా, రెండో మోడల్ ధర రూ.8.97 లక్షలుగా ఉంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఇంజిన్ ఎలా ఉంది?
హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఇంజిన్ గురించి చెప్పాలంటే… ఇందులో 1.2 లీటర్ 4 సిలిండర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్‌కు 83 బీహెచ్‌పీ, 114 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. ఈ కారులో మీరు 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను పొందవచ్చు. సీఎన్‌జీ వేరియంట్ 69 బీహెచ్‌పీ శక్తిని, 95.2 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదని హ్యుందాయ్ అధికారికంగా పేర్కొంది.

ఈ కారులోని ఎంట్రీ లెవల్ వేరియంట్‌తో ఏఎంటీ గేర్‌బాక్స్ అందుబాటులో లేదు. ఎక్స్‌టర్‌లో పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ 19.4 కిలోమీటర్ల మైలేజీని, ఏఎంటీ వేరియంట్ 19.2 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదని కంపెనీ పేర్కొంది. అయితే ఇందులో ఉన్న సీఎన్‌జీ మోడల్ నుండి 27.10 కిలోమీటర్ల వరకు మైలేజీని పొందవచ్చు.

మరోవైపు మారుతి సుజుకి తన నెక్సా లైనప్‌లోని బలెనో, ఇగ్నిస్, సియాజ్ మోడళ్లపై భారీ తగ్గింపును అందిస్తుంది. ఈ అన్ని మోడళ్లపై రూ.5,000 వరకు ‘ప్రీ-నవరాత్రి బుకింగ్ స్కీమ్’ అందిస్తున్నారు. అయితే ఈ ఆఫర్ అక్టోబర్ 15వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇతర నెక్సా మోడల్స్ అయిన గ్రాండ్ విటారా, జిమ్నీ, ఫ్రంటెక్స్ వంటి ప్రముఖ మోడళ్లపై ఎటువంటి తగ్గింపు లేదు.

Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?

Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే – కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *