[ad_1]
Fruits Ease Constipation: మలబద్ధకం అనేది చాలా మంది తరచుగా బాధపడే తీవ్రమైన సమస్య. మలబద్థకం కారణంగా కడుపులో అసౌకర్యంగా ఉంటుంది, కడుపు నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటారు. అంతేకాదు, మలద్వారం కోసుకుపోవడం, రక్తస్రావం, పైల్స్ ఏర్పడే అవకాశం ఉంది. మలం విసర్జించడంలో ఇబ్బందిగా ఉన్నా, పేగు కదలికలు సరిగ్గా లేకపోయినా మలబద్ధకం సమస్య ఎదురవుతుంది. నిశ్చల జీవనశైలి, జంక్ ఫుడ్, వేయించిన ఆహారం, ప్రాసెస్డ్ ఫుడ్, సరిగ్గా నీరు తాగకపోవడం, ఫైబర్ ఎక్కువగా తీసుకోకపోవడం, శారీరరక శ్రమ లేకపోవడం, నీరు తక్కువగా తీసుకోవడం, ఆహారంలో ఫైబర్ తక్కువగా ఉండటం, బలహీనమైన జీవక్రియ, రాత్రిపూట ఆలస్యంగా తినడం వంటి కారణాల వల్ల మలబద్ధకం సమస్య ఎదురవుతుందని నిపుణులు చెబుతున్నారు. మలబద్ధకాన్ని చికిత్స చేయకపోతే.. తీవ్రమైన సమస్యలకు దారితీస్తుందని డిటాక్స్‌ప్రీ వ్యవస్థాపకుడు, హోలిస్టిక్ న్యూట్రిషనిస్ట్ ప్రియాంషి భట్నాగర్ అన్నారు. ఇది ఫైల్స్, పగుళ్లు, పెద్దపేగు క్యాన్సర్‌కు దారి తీస్తుందని అంటున్నారు. మలబద్ధకం సమస్యను నయం చేయడానికి కొన్ని పండ్లు సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.
[ad_2]
Source link
Leave a Reply