Chandrayaan 3: విక్రమ్ ల్యాండర్ దిగుతున్నప్పుడు.. చందమామను చూశారా? వీడియో షేర్ చేసిన ఇస్రో

[ad_1]

ఇప్పటి వరకూ ఏ దేశం అడుగుపెట్టని చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్‌-3 (Chandrayaan 3) సాఫ్ట్ ల్యాండింగ్‌తో భారత్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన చంద్రయాన్‌-3 విక్రమ్ ల్యాండర్‌ నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్ రోవర్‌ చంద్రుడి ఉపరితలంపై అన్వేషణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇస్రో దీనికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది. చంద్రయాన్‌ 3 ల్యాండర్‌ చందమామపై దిగుతుండగా దానికి అమర్చిన కెమెరాలో రికార్డు అయిన వీడియోను షేర్‌ చేసింది.

చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్‌ దిగడానికి కొన్ని కిలోమీటర్ల ముందు మొదలైన ఈ వీడియో.. జాబిల్లి అడుగుపెట్టేవరకు రికార్డయింది. ఇప్పటివరకు ల్యాండర్‌ ‘విక్రమ్‌’ తీసిన కొన్ని ఫొటోలను విడుదల చేసిన ఇస్రో.. ‘విక్రమ్ అడుగుపెట్టడానికి ముందు ల్యాండర్ ఇమేజర్ కెమెరా చంద్రుడి ఫోటోలను ఎలా క్యాప్చర్‌ చేసిందో చూడండి’ అంటూ 2 నిమిషాల 17 సెకన్ల నిడివి ఉన్న వీడియోను తాజాగా షేర్‌ చేసింది. అసాధ్యమనుకున్న ఈ యాత్రను సుసాధ్యం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలపై అన్ని దేశాలూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి.
అత్యంత క్లిష్టమైన దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ అసాధ్యమని భావించినా.. దాన్ని సుసాధ్యం చేసిన తొలిదేశంగా భారత్‌ నిలవడాన్ని కొనియాడుతూ అమెరికా సహా అనేక దేశాల ప్రధాన పత్రికలన్నీ పతాక శీర్షికలతో ప్రత్యేక కథనాలు వెలువరించాయి. ఇవి భారత్‌కు మహత్తర క్షణాలని పొగిడాయి. భారతదేశ శక్తి సామర్థ్యాలపై అనుమానాలు వ్యక్తంచేస్తూ గతంలో మంగళ్‌యాన్‌ మిషన్‌ను ఉద్దేశించి వ్యంగ్య కార్టూన్‌ ప్రచురించిన ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ కూడా భారత్‌కు ఇది గొప్ప విజయం అంటూ కితాబు ఇచ్చింది.

కాగా, 2019 సెప్టెంబరులో ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 2 చివరి నిమిషంలో విఫలం కాగా.. దాని ఆర్బిటన్ చాలా సమాచారాన్ని, ఫొటోలను పంపించింది. ఆ డేటా ఆధారంగానే పట్టుదలతో మరోసారి ఇస్రో శాస్త్రవేత్తలు పకడ్బందీ ఏర్పాట్లతో కేవలం 4 ఏళ్ల వ్యవధిలోనే చంద్రయాన్ 3 ప్రయోగాన్ని చేపట్టి విజయవంతం అయ్యారు. దక్షిణ ధ్రువం చంద్రుడిపై మానవులు నివసించేందుకు ఉత్తమమైన ప్రదేశం కోసం అన్వేషణ సాగుతోందని ఇస్రో ఛైర్మన్ తెలిపారు. దక్షిణ ధ్రువం వద్ద కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని.. అక్కడ సూర్యరశ్మి అవకాశాలు తక్కువ ఉంటాయని పేర్కొన్నారు. కాగా, మిషన్‌లో అత్యంత కష్టతరమైన భాగం ప్రయోగమేనని, అంతరిక్ష నౌక GSLV మార్క్ 3 (విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను కలిగి ఉన్న చంద్రయాన్-3 మాడ్యూల్‌ను ప్రయోగించిన రాకెట్) సరైన కక్ష్యకు చేర్చిన విషయాన్ని ఇస్రో ఛైర్మన్ వివరించారు.

Read More Latest Science & Technology News And Telugu News

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *