గుడ్‌న్యూస్! నెలలోనే తగ్గిపోయిన రీటైల్ ద్రవ్యోల్బణం – ఏకంగా 3 నెలల కనిష్ఠానికి

[ad_1]

Retail Inflation in January: ద్రవ్యోల్బణం కాలంతో పాటు పెరుగుతూనే ఉండే సంగతి తెలిసిందే. అలా మన దేశంలో తాజాగా రిటైల్ ద్రవ్యోల్బణం గతేడాది డిసెంబరు నెలతో పోలిస్తే ఈ ఏడాది జనవరి నెలలో కాస్త తగ్గింది. డిసెంబరులో 5.69 శాతం ఉండగా.. 2024 జనవరిలో 5.10 శాతానికి తగ్గింది. అంటే ఒక్క నెల వ్యవధిలోనే ఈ మార్పు కనిపించింది. 5.10 శాతం అనేది దాదాపు మూడు నెలల కనిష్ఠ స్థాయి. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) సోమవారం (ఫిబ్రవరి 12) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. ఈ విషయం వెల్లడి అయింది. అయితే, దేశంలో ఆహార, పానీయాల (బేవరేజెస్) ద్రవ్యోల్బణం జనవరిలో 8.3 శాతంగా నమోదైందని ఎన్ఎస్ఓ డేటా వివరించింది. ఇది అంతకు ముందు నెల అంటే డిసెంబరులో 8.70 శాతంగా ఉందని స్పష్టం చేసింది.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇలా

గత వారం తాజా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో సెంట్రల్ బ్యాంక్ 2023-24 ఏడాదికి గానూ రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ప్రస్తుత త్రైమాసికానికి (జనవరి – మార్చి), ఇది అంతకుముందు ఉన్న 5.2 శాతం నుంచి 5 శాతానికి తగ్గింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం అంచనాను 4.5 శాతం అంచనాగానే ఉంచారు. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 5 శాతం, రెండో త్రైమాసికంలో 4 శాతం, మూడో త్రైమాసికంలో 4.6 శాతం, నాలుగో త్రైమాసికంలో 4.7 శాతంగా ఉంటుందని అంచనా వేశారు.

అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఎంపిక చేసిన 1,114 పట్టణ ప్రాంతాల్లోని మార్కెట్‌లతో పాటు మరో 1,181 గ్రామీణ ప్రాంతాల మార్కెట్లలో అధ్యయనం చేశారు. ఎన్ఎస్ఓ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ (MoSPI) కు చెందిన ఫీల్డ్ ఆపరేషన్స్ పరిశీలించారు. వీరు ఆయా మార్కెట్లలో వ్యక్తిగతంగా సందర్శించి ప్రతి వారం రోస్టర్‌లో ధరను నమోదు చేసుకున్నారు. అలా జనవరి నెలలో NSO ఎంపిక చేసిన వాటిలో 99.8 శాతం గ్రామాలు.. 98.5 శాతం పట్టణ మార్కెట్‌ల నుంచి ధరలను సేకరించింది. మరోవైపు డిసెంబర్‌లో భారత పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 3.8 శాతం వృద్ధి చెందిందని ఎన్‌ఎస్‌ఓ డేటా వెల్లడించింది.

మరిన్ని చూడండి

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *