ముప్పై దాటిన తర్వాత.. ఆడవాళ్లు కచ్చితంగా ఈ సప్లిమెంట్స్‌ తీసుకోవాలి..!

[ad_1]

Supplements For Women: ముప్పై ఏళ్లు దాటిన తర్వాత.. పురుషులలో, మహిళలో హార్మోన్లు క్షీణించడం ప్రారంభమవుతుంది. గర్భధారణ, నెలసరి వంటి కారణాల వల్ల.. మగవారి కంటే ఆడవారిలో శరీరక మార్పులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ముఫ్పై ఏళ్లు దాటిన తర్వాత.. మహిళల పీరియడ్స్‌ నియంత్రించే.. ఈస్ట్రోజన్‌ ఉత్పత్తి బాగా క్షీణీంచడం ప్రారంభమవుతుంది. 35, సంవత్సరాలు దాటిన తర్వాత.. గణనీయంగా పడిపోతుంది. మహిళల్లో దాని ప్రభావం కారణంగా.. ఊబకాయం, లైంగిక కోరికలు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఈ వయసులో.. హార్మోన్‌ మార్పుల వల్ల కలిగే పరిణామాలు తగ్గించడానికి, మహిళలు కొన్ని రకాల విటమిన్‌ సప్లిమెంట్లు తీసుకోవాలని ప్రముఖ హోమియోపతి వైద్యురాలు స్మితా భోయిర్‌ పాటిల్‌ అన్నారు. ఈ సప్లిమెంట్లు హార్మన్‌, థైరాయిడ్‌ అసమతుల్యతలను సరిచేస్తాయని అన్నారు. సప్లిమెంట్స్ పీరియడ్స్‌, డెలివరీ వల్ల కలిగే రక్తహీనతను నిరోధించడానికి సహాయపడతాయని వివరించారు. ఒత్తిడి, బర్త్‌ కంట్రోల్‌ పిల్స్‌ కారణంగా వచ్చే సైడ్‌ ఎఫెక్ట్స్‌ను ఈ సప్లిమెంట్స్‌ నిరోధిస్తాయి.

సప్లిమెంట్స్‌

విటమిన్‌ B..

-b-

బీ గ్రూప్‌ విటమిన్లు శరీరంలోని అనేక ప్రక్రియలకు సహాయపడతాయి. B విటమిన్లు మనకు తగిన శక్తిని అందించడానికి సహాయపడతాయి. డిప్రెషన్‌ను దూరం చేయడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి ఈ విటమిన్లు తోడ్పడతాయి. విటమిన్ బి సప్లిమెంట్స్‌ తీసుకోవడం వల్ల మహిళల్లో.. మానసిక రుగ్మతులు దూరం అవుతాయి.

విటమిన్‌ D3 + k2

-d3-k2

విటమిన్‌ D3 నిజానికి శరీరంలోని పోషకం కంటే హార్మోన్ లాగా పనిచేస్తుంది. మన బాడీ కాల్షియం శోషించడానికి విటమిన్ D, K2 చాలా ముఖ్యం. విటమిన్ D లోపం కారణంగా కొన్ని క్యాన్సర్లు, ఆటో ఇమ్యూన్‌ డిస్‌ఆర్డర్స్‌, మానసిక రుగ్మతుల ముప్పు పెరుగుతుంది. విటమిన్ D3 + K2 ప్రతి రోజు 600-800 IU మొత్తంలో అవసరం.

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌..

-3-

మన శరీరం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌ను సొంతంగా తయారు చేసుకోలేదు. దాన్ని మన ఆహారం, సప్లిమెంట్స్‌ ద్వారా మాత్రమే తీసుకోగలం. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ నిరాశ, అందోళనను తగ్గించడానికి సహాయపడుతుంది. కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గుండె సమస్యల ముప్పును తగ్గిస్తుంది. మెటబాలిక్ సిండ్రోమ్ లక్షణాలను తగ్గించడానికి, దీర్ఘకాలిక ఇన్ప్లమేషన్‌తో పోరాడటానికి సహాయపడుతుందని అనేక అధ్యయనాలు స్పష్టం చేశాయి. ప్రతిరోజు శరీరానికి 1.59 గ్రాముల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అవసరం.

మెగ్నీషియం..

మెగ్నీషియం మన శరీరానికి ఎంతో ముఖ్యమైన ఖనిజం. మన బాడీ.. 300 కంటే ఎక్కువ శారీరక ప్రక్రియలకు కోఫాక్టర్‌గా మెగ్నీషియంపై ఆధారపడుతుంది. మెగ్నీషియం లోపం ఉన్న వ్యక్తులు కండరాల తిమ్మిరి, , అలసట, మానసిక రుగ్మతలు, హైపర్‌టెన్షన్‌, వికారం, కండాల బలహీనత వంటి సమస్యలతో బాధపడతారు. మన శరీరానికి ప్రతి రోజు 320-400 mg మెగ్నీషియం అవసరం.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *