తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సి57 వాహకనౌక నింగిలోకి మోసుకెళ్లింది. 63 నిమిషాల పాటు ప్రయాణించిన తర్వాత 1480.7 కిలోల ఉపగ్రహాన్ని భూ కక్ష్యలో ప్రవేశపెట్టింది. 16 రోజుల పాటు భూ కక్ష్యలోనే చక్కర్లు కొట్టనున్న ఆదిత్య- ఎల్ 1.. ఐదు విన్యాసాల అనంతరం సూర్యుడివైపు ప్రయాణం మొదలుపెడుతుంది. 110 రోజుల్లో అక్కడకు చేరుకోనుంది.
Source link
