​Anti-Acne Teas: అమ్మాయిలు ఎక్కువగా ఎదుర్కొనే సమస్య మొటిమలు.. చర్మరంధ్రాలు మృతకణాలు, దుమ్ముతో మూసుకుపోవడం వల్ల వస్తుంటాయివి. నూనెలు ఎక్కువగా విడుదలవ్వడం వల్లా కూడా మొటిమలు వస్తుంటాయి. బ్యాక్టీరియా, హార్మోన్‌ అసమతుల్యత, కాలుష్యం, మాస్క్‌లు, హెల్మెట్‌, కొన్ని రకాల ఔషధాలు వాడటం కూడా యాక్నేకు కారణమవుతాయి. మొటిమలు ముఖ సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. మొటిమలను తగ్గించుకోవడానికి అమ్మాయిలు ఏవేవో క్రీమ్స్‌, ప్యాక్స్‌ వాడుతూ ఉంటారు. మొటిమలను దూరం చేయడానికి ఎక్స్‌టర్నల్‌ ట్రీట్మెంట్‌ మాత్రమే కాకుండా.. లోపలి నుంచి కూడా చికిత్స చేయాలని నిపుణులు చెబుతున్నారు. యాక్నె సమస్యకు చెక్‌ పెట్టడానికి కొన్ని హెర్బల్‌ టీలు సహాయపడతాయి. ఈ టీలు హార్మోన్‌ సమతుల్యతను మెరుగుపరచి, సెబమ్‌ స్రావాన్ని నియంత్రిస్తాయి. వీటిలోని యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మ సమస్యలను దూరం చేస్తాయి. ఈ టీల తరచుగా తాగితే.. మొటిమలు దూరమవ్వడమే కాదు.. మెరిసే చర్మం పొందవచ్చు.

గ్రీన్‌ టీ, నిమ్మరసం..

గ్రీన్ టీ, నిమ్మరసం మొటిమల సమస్యకు చెక్‌ పెడతాయి. గ్రీన్‌ టీలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్‌ ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గ్రీన్‌ టీలో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్స్‌ను దూరం చేస్తాయి . గ్రీన్‌ టీలోని కాటెచిన్‌లు, స్టెరాల్స్, ఫైటోన్యూట్రియెంట్స్‌, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్. థినైన్, గ్లుటాలిక్ యాసిడ్, ట్రిప్టోఫాన్ యాక్నె ట్రీట్మెంట్‌కు సహాయపడతాయి. గ్రీన్ టీలోని పాలీఫెనాల్స్ చర్మంలో సెబమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీంతో మొటిమలు రాకుండా నివారించవచ్చు.

పుదీనా టీ..

పుదీనా టీ..

పుదీనా యాంటీ ఆండ్రోజెనిక్‌‌గా పనిచేస్తుంది. ఇది శరీరంలోని ఆండ్రోజెన్ స్థాయిలను తగ్గిస్తుంది. ఆండ్రోజెన్‌ మొటిమలను కలిగించే.. సెబమ్‌ స్రావాన్ని పెంచుతుంది. పుదీనాలో లిమోనెన్, విటమిన్ సి వంటి టెర్పెన్‌లు కూడా ఉంటాయి, ఇవి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్‌గా పనిచేస్తాయి. పుదీనాలోని యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు.. ప్రీ రాడికల్స్‌ వల్ల కలిగే సెల్‌ డ్యామేజ్‌ను నివారిస్తాయి, మొటిమలు నయం చేసే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. పుదీనా టీ.. మొటిమల వల్ల కలిగే నొప్పి, మంటను కూడా తగ్గిస్తుంది.

ఎలా తీసుకోవాలి…

గుప్పెడు పుదీనా ఆకులను తీసుకుని కప్పు నీటిలో వేసి మరిగించి వడగట్టి తాగాలి. మీరు టేస్ట్‌ కోసం తేనె కలుపుకోవచ్చు. మొటిమలు లేకుండా స్పష్టమైన చర్మం కోసం రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ఈ టీ తాగితే మంచిది.

వేప టీ..

వేప టీ..

మొటిమలను ట్రీట్‌ చేయడానికి వేప ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. వేపలో ఆస్ట్రింజెంట్ స్వాభావం ఉంటుంది. ఇది శరీరంలోని పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేస్తుంది. దీనిలో మెటిమల సమస్యకు చెక్‌ పెట్టే.. అజాడిరాక్టిన్, నింబోలిన్, క్వెర్సెటిన్ ఇతర క్రియశీల పదార్థాలు ఉంటాయి. వేపలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి మంటను నివారిస్తాయి. మొటిమలు, మచ్చలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నిరోధించడానికి వేప సహాయపడుతుంది. వేపాకు క్లెన్సర్‌లా పనిచేస్తుంది. మీ చర్మంపై పేరుకున్న మురికి, డెడ్‌ సెల్స్‌ను శుభ్రం చేస్తుంది.

ఎలా తీసుకోవాలి..

ఒక గ్లాస్‌ నీటిలో రెబ్బ వేపాకులు వేసి 5 నిమిషాల పాటు మరిగించండి. ఆ తర్వాత వడపోసి.. గోరువెచ్చగా అయిన తర్వత 1 టీస్పూన్‌ తేనె మిక్స్‌ చేయండి. మొటిమలు తగ్గే వరకు ఈ టీ రోజూ తాగుతుండాలి. ఇలా చేస్తే మచ్చలు కూడా మాయం అవుతాయి.

పసుపు టీ..

పసుపు టీ..

పసుపు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనిలో కర్కుమిన్‌కు యాంటీబ్యాక్టీరియలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియలు గుణాలు ఉంటాయి. అందుకే, టర్మరిక్‌ ఎక్స్‌ట్రాక్ట్‌ను యాంటీ యాక్నే క్రీమ్‌లలో, ఆయింట్‌మెంట్లలో వాడుతూఉంటారు.
ఎలా తయారు చేసుకోవాలి..
ఒక గ్లాస్‌ నీటిలో.. చిటికెడు పసుపు వేసి 5 నిమిషాల పాటు మరిగించండి. టేస్ట్‌ కోసం దీనిలో తేనె యాడ్‌ చేసుకోండి. ఈ టీని ఉదయం పూట తాగితే.. మొటిమల సమస్య దూరం అవుతుంది.
గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *