Break fast Tips: వేలాడే పొట్ట తగ్గాలంటే.. మీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి అసలు తినకూడదు..!

[ad_1]

Break fast Tips: బ్రేక్‌ఫాస్.. రోజులో అదే ముఖ్యమైన ఆహారం అని నిపుణులు చెబుతూ ఉంటారు. మనం ఆ రోజంతా పని చేయడానికి కావలసిన శక్తి.. అల్పాహారం నుంచే వస్తుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ టిఫిన్‌ స్కిప్‌ చేయవద్దని పోషకాహార నిపుణులు అంటూ ఉంటారు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం.. ఉదయం పూట 7 నుంచి 8 గంటల మధ్య లేదా.. 10 గంటలకు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం నిద్రలేచిన తర్వాత రోజంతా మిమ్మల్ని చురుకుగా ఉంచేందుకు అల్పాహారం మీ శరీరాన్ని సిద్ధం చేస్తుంది. మనం బ్రేక్‌ఫాస్ట్‌లో ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. కొన్ని ఆహార పదార్థాలు మన కడుపు నింపడమే కానీ, మన శరీరానికి ఎలాంటి పోషకాలు అందిచవు, పైగా మనం బరువు పెరిగేలా చేస్తాయి. మన వెయిట్‌ కంట్రోల్‌ చేయడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి.. ఉదయం పూట తినకూడని ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.

కాఫీ..

మీ బెల్లీ ఫ్యాట్‌ తగ్గించుకోవాలనుకుంటే.. బ్రేక్‌ఫాస్ట్‌లో క్రీమ్, అదనపు చక్కర వేసిన కాఫీ తాగకూడదని నిపుణులు అంటున్నారు. ఉదయం పూట చక్కెర తీసుకుంటే.. బరువు పెరగడంతో పాటు, బెల్లీ ఫ్యాట్‌ ఎక్కువ అవుతుంది. వీటితో పాటు అనేక అరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

షుగర్‌ వేసిన డ్రింక్స్‌.. చక్కెర వేసిన ఆహార పదార్థాల కంటే ప్రమాదమని.. హార్వర్డ్ హెల్త్ స్పష్టం చేసింది. ఈ పానీయాలలో.. చాలా తక్కువ పోషకాలు ఉంటాయి. ఉదయం పూట కాఫీ తాగాలనుకుంటే.. తక్కువ చక్కెర వేసుకోవాలని, వీలైతే.. బ్లాక్‌ కాఫీ తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వైట్‌ బ్రెడ్‌..

బిజీబిజీ లైఫ్‌స్టైల్‌ కారణంగా.. చాలా మంది బ్రేక్‌ఫాస్‌లో వైట్‌ బ్రెడ్‌ టోస్ట్‌ ఫ్రిఫర్‌ చేస్తూ ఉంటారు. వైట్‌ బ్రెడ్‌ మైదాతో తయారు చేస్తారు.. శుద్ధి చేసిన పిండి పదార్థాల కారణంగా వేగంగా బరువు పెరుగుతారు. ముఖ్యంగా.. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుంటుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లోని ఒక నివేదిక ప్రకారం, తృణధాన్యాలు తక్కువ కొవ్వు ఉంటాయి. మీకు అల్పాహారంలో బ్రెడ్‌ తినే అలవాటు ఉంటే.. బ్రైన్‌ బ్రెడ్ తినడం మంచిది.

సెరల్స్‌..

యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీ అధ్యయనం ప్రకారం, అధిక చక్కెర బెల్లీ ఫ్యాట్‌ పెంచుతుంది. మార్కెట్లో దొరికే రెడీమేడ్‌ సెరల్స్‌లో చక్కెర అధికంగా ఉంటుంది. ఇవి టిఫిన్‌లో తింటే బరువు పెరుగుతారు. మీరు సెరల్స్‌ కొనేప్పుడు.. తక్కువ చక్కెర, ఎక్కువ ఫైబర్‌, ప్రొటీన్‌ ఉన్నవి చూసుకుని తీసుకోండి. (image source – pixabay)

ఫాస్ట్‌ ఫుడ్‌..

ఫాస్ట్ ఫుడ్‌ను చాలా మంది ఇష్టం తింటారు. కానీ, ఇవి ఆరోగ్యానికి ఎంతగానే హాని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఫాస్ట్‌ ఫుడ్‌లో ట్రాన్స్‌ ఫ్యాట్‌ చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే.. ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్‌, గుండె సమస్యలు, డయాబెటిస్‌ ముప్పును పెంచుతుంది. (image source- Pixabay)

ప్రాసెస్డ్‌ మీట్‌..

ప్రాసెస్ చేసిన మాంసాలలో కేలరీలు, ట్రాన్స్‌ ఫ్యాట్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా బెల్లీ ఫ్యాట్‌ పెరుగుతుంది. ఇవి ఎక్కువగా తింటే.. గుండె జబ్బులు, స్ట్రోక్‌ ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *