[ad_1]
ఆదివారం నాడు మరో 3 మీటర్ల దూరంలో గొయ్యి ఉందనగా.. గ్రౌండ్ కమాండో కంట్రోల్ స్టేషన్ నుంచి రోవర్‌కు శాస్త్రవేత్తలు సంకేతాలు పంపారు. ఈ మేరకు రోవర్ గమనానికి సంబంధించిన రెండు ఫొటోలను ఇస్రో పంచుకుంది. అందులో గొయ్యి ఉన్న ప్రాంతం, కొత్త దారిలో ప్రజ్ఞాన్ రోవర్ ప్రయాణిస్తున్న మార్గాన్ని చూడవచ్చు. మరోవైపు, చంద్రుని ఉపరితలంపై దక్షిణ ధ్రువం చుట్టూ ఉన్న ఉష్ణోగ్రతలను చంద్రయాన్-3 (Chandrayaan- 3) కొలిచినట్టు ఇస్రో వెల్లడించిన విషయం తెలిసిందే.
ఉపరితలంపై ఉష్ణోగ్రతల తీరు, వాటి నమోదుకు ల్యాండర్లో చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్ (ChaSTE) పేలోడ్‌ను అమర్చారు. ఈ చాస్టె పేలోడ్.. దక్షిణ ధ్రువంపై ఉపరితల ఉష్ణోగ్రతలను లెక్కించింది. దీనికి సంబంధించిన గ్రాఫ్‌ను పంచుకున్న ఇస్రో.. ‘గ్రాఫ్ చంద్రుని ఉపరితలం / ఉపరితలం వివిధ లోతులలో ఉష్ణోగ్రత వైవిధ్యాలను వివరిస్తుంది.. చంద్రయాన్-3 వీటిని నమోదు చేసింది’ అని తెలిపింది.
మరోవైపు, చంద్రుడికి సంబంధించి ఇప్పటి వరకు ఏ దేశమూ తీయని అద్భుతమైన ఫొటోలు తమ వద్ద ఉన్నాయని ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ కూడా వెల్లడించారు. అవి తమ కంప్యూటర్ కేంద్రానికి వెళుతున్నాయని, అక్కడ శాస్త్రవేత్తలు వాటిని ప్రాసెస్ చేస్తున్నారని.. త్వరలోనే ఆ ఫొటోలను విడుదల చేస్తామని తెలిపారు. జాబిల్లిపై ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ సమర్థంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. కొన్ని పరిశోధనల్లో భాగంగా రోవర్ కచ్చితంగా వేర్వేరు ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. రాబోయే 10 రోజుల్లో ల్యాండర్, రోవర్లు అన్ని పరిశోధనలను పూర్తిచేస్తాయని తెలిపారు. మరోవైపు, చంద్రయాన్-3 మిషన్ మూడింట రెండు లక్ష్యాలు పూర్తయినట్టు ఇస్రో తెలిపింది. మొదటిది జాబిల్లి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్‌ను (Vikram Lander) సురక్షితంగా దించడం.. రెండోది చంద్రుడి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్‌ను (Pragyan Rover) విజయవంతంగా నడపడం ఈ రెండూ పూర్తయ్యాయని.. మూడో లక్ష్యం పరిశోధనలు కొనసాగుతున్నాయని పేర్కొంది.
Read More Latest Science & Technology News And Telugu News
[ad_2]
Source link
Leave a Reply