PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Credit Card: SBI పై ఢిల్లీ వినియోగదారుల ఫోరమ్ జరిమానా.. క్రెడిట్ కార్డు గడువు ముగిసినా..

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|


Credit
Card:

దాదాపు
ఆర్థిక
కార్యకలాపాలు
అన్నింటికీ
బ్యాంకులపై
ఆధారపడాల్సి
వస్తోంది.
కానీ
అవి
వినియోగదారులపై
ఇబ్బడిముబ్బడిగా
ఛార్జీలు
వసూలు
చేస్తూ,
ఇష్టారాజ్యంగా
వ్యవహరిస్తున్నాయి.
కొందరు
కోర్టు
మెట్లెక్కితేనే
కానీ
అసలు
అటువంటి
నిబంధనలు
ఉన్నాయి
అని
సామాన్య
ప్రజలకు
తెలియడం
లేదు.
కొన్ని
సందర్భాల్లో
అయితే
ఆయా
బ్యాంకులపై
కోర్టులు,
RBI
చర్యలు
తీసుకోవడం
చూస్తున్నాం.

SBI
కార్డ్స్
&
పేమెంట్స్
సర్వీసెస్
ప్రైవేట్
లిమిటెడ్‌
పై
ఢిల్లీ
వినియోగదారుల
ఫోరమ్
ఆగ్రహం
వ్యక్తం
చేసింది.
తన
కార్డ్
గడువు
ముగిసిన
తర్వాత
కూడా
బిల్లు
పంపినందుకు
మరియు
ఛార్జీలు
చెల్లించని
కారణంగా
బ్లాక్‌
లిస్ట్‌లో
ఉంచినందుకు

వ్యక్తి

సంస్థపై
ఫిర్యాదు
చేశాడు.
ఘటనపై
విచారణ
జరిపిన
ఫోరమ్
సదరు
బాధితుడికి
2
లక్షలు
చెల్లించాలని
ఆదేశించింది.

Credit Card: SBI పై ఢిల్లీ వినియోగదారుల ఫోరమ్ జరిమానా..

క్రెడిట్
కార్డు
గడువు
ముగియడానికి
చాలా
ముందుగానే
ఏప్రిల్
2016లో
తన
కార్డును
రద్దు
చేయాలని,
దానిని
పునరుద్ధరించవద్దని
మాజీ
పాత్రికేయులు
MJ
ఆంథోనీ
SBIని
అభ్యర్థించారు.
ఏప్రిల్
9,
2016
తర్వాత
ఎలాంటి
లావాదేవీలకు
కార్డును
ఉపయోగించలేదు.
నిబంధనల
ప్రకారం
కార్డును
ధ్వంసం
చేశారు.
తన
కార్డు
రద్దు
గురించి
కంపెనీ
నుంచి
సెప్టెంబరులో
ఒక
లేఖను
సైతం
అందుకున్నారు.
అయితే
తన
నిరసన
ఇ-మెయిల్స్
పట్టించుకోకుండా
కంపెనీ
బిల్లులను
పంపిస్తూనే
ఉంది.

“మే
18,
2017
నాటికి
లేట్
పేమెంట్
ఛార్జీలు,
పెనాల్టీతో
కలిపి
2
వేల
946
బిల్లు
చెల్లించాలని
స్టేట్
మెంట్
మెయిల్
వచ్చింది.
బిల్లు
చెల్లించాలని
కంపెనీ
అందులో
హెచ్చరించింది.
లేకుంటే
క్రెడిట్
బ్యూరో
నిర్వహించే
రుణ
చరిత్రపై
ప్రతికూల
ప్రభావాన్ని
చూపుతుంది
మరియు
భవిష్యత్తులో
క్రెడిట్
అవసరాలకు
ఆటంకం
కలిగించవచ్చు”
అని
SBI
కార్డ్స్
పేర్కొన్నట్లు
ఆంథోని
పేర్కొన్నారు.

RBI
నిర్వహిస్తున్న
ఉద్దేశపూర్వక
డిఫాల్టర్ల
యొక్క
CIBIL
వ్యవస్థలో
కంపెనీ
తనను
బ్లాక్
లిస్ట్
చేసినట్లు
ఆంథోనీ
తెలిపారు.
రుణాలు,
క్రెడిట్
కార్డ్స్
పొందడంలో
ఇబ్బంది
పడాల్సి
వచ్చిందని
వెల్లడించారు.
లోపభూయిష్టమైన
సేవలు
అందించినందుకు
గాను
2
నెలల్లో
2
లక్షల
పరిహారం
చెల్లించాలని
వినియోగదారుల
ఫోరమ్
తీర్పు
నిచ్చింది.
అది
విఫలమైతే
పరిహారం
3
లక్షలు
అవుతుందని
పేర్కొంది.
అయితే
ఆంథోనీ
ఆరోపణలను
కంపెనీ
ఖండించింది.

English summary

Delhi Consumer Forum fines SBI Cards on services quality issue

Delhi Consumer Forum fines SBI Cards on services quality issue

Story first published: Friday, May 26, 2023, 8:51 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *