Diabetes Diet: వర్షాకాలం ఈ పండ్లు తింటే.. షుగర్‌ కంట్రోల్‌ ఉంటుంది..!

[ad_1]

బొప్పాయి..

బొప్పాయి..

షుగర్‌ పేషెంట్స్‌ వర్షాకాలంలోనే కాదు, ఏడాది పొడవునా బొప్పాయి తినవచ్చు. బొప్పాయి షుగర్‌ పేషెంట్స్‌కు బెస్ట్‌ ఫ్రూట్‌ అనొచ్చు. దీనిలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఫ్లేవనాయిడ్లు సహజ యాంటీఆక్సిడెంట్లు, ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. USDA ప్రకారం, ఒక కప్పు బొప్పాయిలో 11 గ్రాముల చక్కెర ఉంటుంది. బొప్పాయిలో గ్లైసెమిక్ ఇండెక్స్ 60 ఉంది, ఇది రక్తంలో చక్కెరను త్వరగా పెంచదు.

(image source – pixabay)

నేరేడు..

నేరేడు..

ఈ కాలంలో నేరేడు పండ్లు ఎక్కువగా దొరుకుతాయి. నేరేడుపండులో డయాబెటిస్‌ను తగ్గించే ఔషధగుణాలు మెండుగా ఉన్నాయి. ఈ పండ్లూ గింజల్లోని జంబోలిన్‌, జంబోసిన్‌ అనే పదార్థాలు ఇన్సులిన్‌ స్రావాన్ని పెరిగేలా చేయడంతోపాటు రక్తంలోకి చక్కెర నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తాయి. (image source – pixabay)​

Tips To Relive Back Pain: నడుము నొప్పా..? అయితే ఈ జాగ్రత్తలు తప్పని సరి

అవకాడో..

అవకాడో..

షుగర్‌ పేషెంట్స్‌ వారి డైట్‌ అవకాడో చేర్చుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇది శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా టైప్‌ 2 డయాబెటిస్‌ పేషెంట్స్‌ అవకాడో తింటే షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇందులో విటమిన్లు, పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

(image source – pixabay)

ఆల్‌బక్రా..

ఆల్‌బక్రా..

వర్షాకాలంలో మార్కెట్లో ఆల్‌బక్రా పండ్లు ఎక్కువగా దొరుకుతాయి. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అలాగే, ఇది కార్బోహైడ్రేట్లను నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఆల్‌బక్రాలోని విటమిన్లు, మినరల్స్‌, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను ఎఫెక్టివ్‌గా తగ్గిస్తాయి. ఒక కప్పు ఆల్‌బక్రాలో 16 గ్రాముల చక్కెర మాత్రమే ఉంటుంది. ఇందులో ఉండే పీచు ఫ్రీబయోటిక్స్. ఇది ప్రేగులకు మేలు చేస్తుంది.

(image source – pixabay)​

Rose Tea:గులాబీ టీతో నెలసరి నొప్పులకు చెక్‌ పెట్టేయండి..!

చెర్రీస్‌..

చెర్రీస్‌..

చె ర్రీస్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటాయి. ఇది షుగర్‌ పేషెంట్స్‌కు మేలు చేస్తుంది. దీనిలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది, ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది, చర్మ ఆరోగ్యానికి మంచిది. (image source – pixabay)

పియర్స్‌..

పియర్స్‌..

వర్షాకాలంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి పియర్స్‌ ఉత్తమమైన పండ్లు. ఫైబర్ అధికంగా ఉండే ఈ పండ్ల గ్లైసెమిక్ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది.

(image source – pixabay)

బత్తాయి..

బత్తాయి..

వర్షాకాలంలో ఎక్కువ దొరికే పండ్లలో బత్తాయి ఒకటి. బత్తాయిలో ఫైబర్‌, విటమిన్‌ సి సమృద్ధిగా ఉంటాయి. దీనిలో గ్రైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది. ఫ్లేవనాయిడ్ కంటెంట్‌ సమృద్ధిగా ఉంటుంది. షుగర్‌ పేషెంట్స్‌, బరువు తగ్గాలనుకునేవారు వర్షాకాలంలో బత్తాయిలు తింటే మేలు జరుగుతుంది.

జామకాయ..

జామకాయ..

జామకాయ రక్తంలోని చక్కెర స్థాయిలను బాగా తగ్గించగలవు. ఇందులో ఉండే పీచు చక్కెర శోషణను నియంత్రిస్తూ రక్తంలో చక్కెరస్థాయిని పెరగనివ్వదు. దీని గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ 12 మాత్రమే. వీటిలో సోడియం శాతం తక్కువగా.. పోటాషియం శాతం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, సి, వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి మేలు చేస్తాయి.

(image source – pixabay)
​​​గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *