[ad_1]
డిజిటల్ స్క్రీన్ ఎక్కువగా చూస్తుంటే..
ఈ ప్రపంచం డిజిటల్ స్క్రీన్లతో నిండిపోయింది. టెలివిజన్, కంప్యూటర్‌లు, స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు.. ఇలా ప్రతి ఇంట్లో దర్శనమిస్తున్నాయి. ప్రతి రోజు స్కీన్ చూస్తూ ఎంత సమయం గడుపుతున్నారో దాన్ని స్క్రీన్ టైమ్ అంటారు. ఎక్కువ సమయం డిజిటల్ స్క్రీన్ చూస్తుంటే.. మీ కంటి చూపును దెబ్బతీస్తుంది, ముఖ్యంగా పిల్లలలో ఒత్తిడికి కారణం అవుతుంది. మీ పిల్లల స్క్రీన్ ముందు ఎంత సమయం గడుపుతున్నారో అనేదానిపై నియంత్రణ కచ్చితంగా ఉండాలి.
(image source – pixabay)
స్మోకింగ్ ఎక్కువగా చేసినా..
స్మోకింగ్ మీ ఊపిరితిత్తులు, గుండెకు ఎంత హాని చేస్తుందో, కళ్లకూ అంతే హానిచేస్తుంది. స్మోకింగ్ మాక్యులార్ డీజెనరేషన్, కంటిశుక్లం, ఆప్టిక్ నరాలు దెబ్బతినడం వంటి ముప్పు పెరుగుతుంది. ఈ సమస్యలు దృష్టిలోపానికి దారితీస్తాయి. అంతేకాకుండా, 50 ఏళ్లు పైబడిన పెద్దవారిలో దృష్టిని కోల్పోవడానికి క్యాన్సర్ ప్రధాన ట్రిగ్గర్.
(image source – pixabay)
ఇతర ఆరోగ్య సమస్యలను కంట్రోల్‌లో ఉంచుకోకపోతే..
డయాబెటిస్, హైపర్‌టెన్షన్, అధిక బరువు, థైరాయిడ్ వంటి దీర్షకాలిక సమస్యలను కంట్రోల్‌లో ఉంచుకోకపోతే.. కంటి చూపు క్షీణించే ప్రమాదం ఉంది. హైపర్‌టెన్షన్ ఎక్కువైతే.. హైపర్‌టెన్సివ్ రెటినోపతి సమస్య వచ్చే ప్రమాదం ఉంది.
(image source – pixabay)
నీళ్లు సరిగ్గా తాగకపోయినా..
శరీర ఉష్ణోగ్రత, ఇతర జీవసంబంధమైన విధులను నియంత్రించడానికి మన కణాలు, అవయవాలు, కణజాలాలకు నీరు అవసరం. కన్నీళ్ల ఆకారంలో ఉండే నీరు మన కళ్లను తేమగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. వాతావరణంలోని దుమ్ము, మలినాలు, ఇతర కణాలు మన కళ్లకు చేరడం సహజం. కళ్లలో తేమ లేకపోతే.. కళ్లు పొడిబారడం, ఎర్రబటం, వాపు వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
(image source – pixabay)
నిద్ర, శారీరక శ్రమ లేకపోయినా..
నిద్ర సరిగ్గా లేకపోతే.. కళ్లు పొడిబారడం, ఎర్రటి కళ్లు, నల్లటి వలయాలు, కాంతి సున్నితత్వం వంటి సమస్యలు ఎదురవుతాయి. నిద్ర లేమి శరీరంలోని హార్మోన్లు, న్యూరోనల్ మార్పులకు కారణం అవుతుంది. ఈ మార్పులు బలహీనమైన దృష్టిని తీవ్రం చేస్తాయి. శారీరక శ్రమ లేకపోయినా కంటి చూపు బలహీనపడుతుంది.
(image source – pixabay)
Wrong food combinations: భోజనం చేసిన వెంటనే పండ్లు తింటున్నారా..?
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply