PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Ginger for female health: ఆడవాళ్లు అల్లం తీసుకుంటే.. ఎన్ని లాభాలో తెలుసా..?

[ad_1]

​Ginger for female health: వంటింటిలో ఉన్న గొప్ప ఔషధాలలో అల్లం కూడా ఒకటి. వంటకాల్లోనూ, సంప్రదాయ ఔషధాల తయారీలోనూ దీనిని వినియోగిస్తారు. అల్లం వంటకాల రుచిని పెంచడమే కాదు.. మన ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అల్లంలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్‌, విటమిన్‌ బీ3, బీ6, సీ, ఐరన్‌, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్సరస్‌, జింక్‌, ఫొలేట్‌, నియాసిన్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అల్లంలో యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. అల్లంలోని పోషకాలు మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆడవాళ్లు రోజు అల్లం తీసుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.

నెలసరి సమస్యలకు చెక్‌..

నెలసరి సమస్యలకు చెక్‌..

నెలసరి సమయంలో చాలామంది మహిళలు కడుపునొప్పి, నడుం నొప్పి, కాళ్లు లాగడం, అధిక రక్త స్రావం, వాంతులు, కళ్లు తిరగడం, నీరసం, చికాకు, తిమ్మిర్లు వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. నెలసరి సమస్యలకు చెక్‌ పెట్టడానికి అల్లం గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. అల్లంలోని లక్షణాలు.. పీరియడ్స్‌ ప్రాబ్లమ్స్‌ను తగ్గించడానికి సహాయపడతాయని అధ్యయనాలు స్పష్టం పేర్కొన్నాయి. అల్లంలోని ఔషధ గుణాలు.. గర్భాశయం ద్వారా ప్రోస్టాగ్లాండిన్స్ ఉత్పత్తిని నిరోధింస్తుంది, కండరాల నొప్పులు, వాపులను తగ్గిస్తుంది. పీరియడ్స్‌ టైమ్‌లో అల్లం టీ తాగితే.. ఉపశమనం లభిస్తుంది. (image source – pixabay)

యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయ్..

యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయ్..

అల్లంలో శక్తివంతమై.. యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. అల్లంలో దాదాపు 40 యాంటీ ఆక్సిడెంట్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి శరీరం అంతా యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలకు మద్దతు ఇస్తాయి. అల్లం తరచుగా తీసుకుంటే.. జీర్ణక్రియమ మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి పెరగుతుంది, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది, ప్రసవం తర్వాత కండరాల ఉపశమనానికి తోడ్పడుతుంది. (image source – pixabay)

పీసీఓఎస్‌ లక్షణాలు తగ్గుతాయ్‌..

పీసీఓఎస్‌ లక్షణాలు తగ్గుతాయ్‌..

అల్లంలో ఓషధ గుణాలు మహిళల శరీరంలో ఉండే హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడతాయి. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది పీసీఓఎస్‌ కారణంగా వచ్చే నొప్పులు, మూడ్‌ స్వింగ్స్‌, తలనొప్పి వంటి లక్షణాలు తగ్గిస్తుంది. పీసీఓఎస్‌తో బాధపడేవారు రోజు అల్లం టీ తాగితే.. మేలు జరుగుతుంది.

మలబద్ధకానికి చెక్..

మలబద్ధకానికి చెక్..

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు సాధారణంగా మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటారు. మలబద్ధకం సమస్యకు చెక్‌ పెట్టడానికి అల్లం ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అల్లంలో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఉదయాన్నే బౌల్‌‌ కదలికలు కష్టంగా ఉంటే.. అల్లం టీ తాగితే మేలు జరుగుతుంది.

కొలెస్ట్రాల్‌ కరుగుతుంది..

కొలెస్ట్రాల్‌ కరుగుతుంది..

అల్లం కలెస్ట్రాల్‌ను కరిగించడానికి ప్రభావవంతంగా పని చేస్తుంది. NCBIలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, అల్లం తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయి. ఈ అధ్యయనంలో.. పరిశోధకులు పది వారాలపాటు అల్లం నీటిని ఎలుకల గుంపుకు ఇచ్చారు. వాటి బ్లడ్‌ ప్లాస్మాలో 27% ట్రైగ్లిజరైడ్స్, 29% కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గినట్లు గుర్తించారు. అల్లంలో హైపోలిపిడెమిక్ ఏజెంట్ కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి ఎఫెక్టివ్‌గా పని చేస్తుందని చెబుతున్నారు. (image source – pixabay)

బరువు తగ్గుతారు..

బరువు తగ్గుతారు..

బరువు తగ్గించేందుకు అల్లం సహాయపడుతుంది. రోజూ ఉదయం అల్లం వేసి మరిగించిన నీటిని తాగటం వల్ల అనవసరమైన కొవ్వు కరుగుతుంది. ఉదయం లేవగానే నీటిలో అల్లం వేసి మరిగించాలి. ఈ నీళ్లను వడగట్టి తేనె, పుదీనా ఆకులు వేసుకుని తాగండి. రోజూ వండే కూరల్లో కచ్చితంగా అల్లం చేర్చుకోండి.

(image source – pixabay)

పునరుత్పత్తివ్యవస్థకు మేలు చేస్తుంది..

పునరుత్పత్తివ్యవస్థకు మేలు చేస్తుంది..

అల్లం మహిళల పునరుత్పత్తి వ్యవస్థకు మేలు చేస్తుందని పరిశోధనలు స్పష్టం చేస్తుంది. . ఇది ఫోలిక్యులోజెనిసిస్ /అండాశయ ఫోలికల్ పరిపక్వతకు సానుకూల ప్రభావం చూపుతుంది. అల్లంలో కార్డియోప్రొటెక్టివ్ లక్షణాలు ఉంటాయి. అల్లం శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. (image source – pixabay)

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో 1 స్పూన్‌ ఈ గింజలు తింటే.. గుండెకు మంచిది..!

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *