Health Tips: ఈ అలవాట్లు మీకు ఉంటే.. నిండు నూరేళ్లు హ్యాపీగా బతికేస్తారు..!

[ad_1]

క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి..

క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి..

ప్రతి వారం కనీసం 150 నిమిషాల మితమైన-తీవ్రత వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 75 నిమిషాల చురుకైన ఏరోబిక్ ఎక్స్‌అర్‌సైజ్‌ చేస్తే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అంటున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే.. ఎముకలు, కండరాలను బలోపేతం చేయవచ్చు, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.

Brain Health: ఎప్పుడూ మబ్బుమబ్బుగా ఉంటుందా..? అయితే ఈ పోషకాలు తీసుకోండి..!

సమతుల్య ఆహారం తీసుకోండి..

సమతుల్య ఆహారం తీసుకోండి..

పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులతో సహా వివిధ రకాల పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను మీ డైట్‌లో తీసుకుంటే.. మీ శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్‌, యాంటీఆక్సిడెంట్లు అందుతాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. (image source – pixabay)

ప్రశాంతమైన నిద్ర..

ప్రశాంతమైన నిద్ర..

​నిద్ర శారీరక, మానసిక ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ప్రశాంతమైన నిద్ర అభిజ్ఞా పనితీరును పెంచుతుంది, దీర్ఘాయువును ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మీ దీర్ఘాయుషుతో ఉండాలంటే.. ప్రతి రోజు రాత్రి 7 నుంచి 9 గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలి.​

Liver Health: మహిళల్లో లివర్‌ సమస్యలకు కారణాలు ఇవే..!

ఒత్తిడి తగ్గించుకోండి..

ఒత్తిడి తగ్గించుకోండి..

ఒత్తిడి కేవలం మానసిక సమస్య మాత్రమే కాదు, ఒత్తిడి కారణం డయాబెటిస్‌, అధిక బరువు, ఆస్థమా, మతిమరుపు వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఒత్తిడితో అకాల వృద్ధాప్యం, అకాల మరణం ముప్పూ ముంచుకొస్తుందని నిపుణులు అంటున్నారు. మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే.. స్ట్రెస్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉండటం చాలా ముఖ్యం. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు, యోగా ప్రాక్టిస్ చేయండి.

సోషల్‌ రిలేషన్స్‌..

సోషల్‌ రిలేషన్స్‌..

బలమైన సంబంధాలను కొనసాగించడం, సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం, ఇష్టమైన వారితో సన్నిహితంగా ఉండటం మానసిక శ్రేయస్సును మెరుగుపరుస్తుంది. ఒటరితనం ఒత్తిడి, ఆందోళనను పెంచుతుంది. ఇది అనారోగ్యాల ముప్పును పెంచుతుంది, ఇది ఆకాల మరణానికి దారితీస్తుంది.

రెగ్యులర్ హెల్త్ చెకప్స్‌ చేయించుకోండి..

రెగ్యులర్ హెల్త్ చెకప్స్‌ చేయించుకోండి..

ఆరోగ్య సమస్యలను ముందుగా గుర్తించడం, టీకాలు, వివిధ స్క్రీనింగ్‌ టెస్ట్‌లు చేయించుకుంటే.. అనారోగ్యాలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. దీంతో ఆయుర్దాయం పెరుగుతుంది.

స్మోకింగ్‌, ఆల్కహాల్‌కు దూరంగా ఉండండి..

స్మోకింగ్‌, ఆల్కహాల్‌కు దూరంగా ఉండండి..

స్మోకింగ్ క్యాన్సర్‌, గుండె సమస్యలు, శ్వాసకోశ సమస్యలు వంటి అనారోగ్యాల ముప్పును పెంచుతుంది. ఇది మీ ఆయుర్దాయాన్ని తగ్గిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని స్మోకింగ్‌కు దూరంగా ఉంటే మంచిది. ఆల్కహాల్‌ లివర్‌ సమస్యలు, క్యాన్సర్ల ముప్పును పెంచుతుంది. మీరు ఎక్కువ కాలం బతకాలనుకుంటే.. స్మోకింగ్‌, ఆల్కహాల్‌ తాగడం వంటి అలవాట్లకు దూరంగా ఉండండి.

Liver Health: మహిళల్లో లివర్‌ సమస్యలకు కారణాలు ఇవే..!

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *